కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయన శాఖ పరిశోధక విద్యార్థి పెనుమూరు సాయిలక్ష్మికి డాక్టరేట్ ప్రదానం చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.
తెలుగు భాషలు, అనువాద అధ్యయన శాఖ విభాగపు సహాయఆచార్యులు డాక్టర్ ఏకే వేణుగోపాల్ రెడ్డి పర్యవేక్షణలో “సాహిత్య ప్రస్థానంలో నవలలు – స్త్రీ చైతన్యం 2008 నుంచి 2018 ” అనే అంశంపై పరిశోధన గ్రంథాన్ని వర్సిటీకి సమర్పించినట్లు వెల్లడించారు.
జాతీయ, అంతర్జాతీయ పరిశోధన జర్నల్స్ లలో అనేక పరిశోధన పత్రాలను ప్రచురించారు. జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పాల్గొని అనేక సాహిత్య నవల అంశాలపై చైతన్యం వంటి అంశాల గురించి పత్రాలు సమర్పణ చేశారు.
ఈమె దాదాపు గత 15 సంవత్సరాల నుంచి భారత విద్యార్థి ఫెడరేషన్ చిత్తూరు జిల్లా కార్యదర్శిగా పనిచేశారు అనేక విద్యార్థి ఉద్యమాలు నిర్వహించారు.
ప్రస్తుతం ఐద్వా జిల్లా కార్యదర్శి గా పని చేస్తున్నారు. సాయిలక్ష్మి కి డాక్టరేట్ అవార్డు రావడం పట్ల పలువురు రచయితలు, ఐద్వా డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నేతలు, ఆచార్యులు, విద్యార్థులు, కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.
.