‘సైరా’పై నిర్మాతల్లో అసంతృప్తి

399

సెకండ్ ఇన్నింగ్స్‌లో మరోసారి  బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించడానికి మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డిగా మన ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. సినిమా పనులు శరవేగంగా సాగుతూనే ఉన్నాయి. దీనికి మెయిన్ నిర్మాత రామచరణ్ అయినప్పటికీ.. సహకారం అందిస్తున్న ఇతర నిర్మాతలు.. ఒక విషయంలో మాత్రం అసంతృప్తిగా ఉన్నారట. సినిమా ప్రమోషన్ విషయంలో… సైరా కు స్థాయికి తగినట్లుగా బజ్ తీసుకురావడంలో సినిమా టీమ్ ఫెయిలవుతోందని అనుకుంటున్నారట.

ఈరోజుల్లో సినిమా ఎలా ఉన్నప్పటికీ.. దాని మార్కెటింగ్ అనేది చాలా కీలకంగా మారింది. వందరోజులు సినిమాలు ఆడే రోజులు గతించిపోయిన తర్వాత.. ఓపెనింగ్ వీక్స్ లోనే… అంటే.. సినిమా ఎలా ఉందనే విషయమై ప్రేక్షకులు ఒక అభిప్రాయానికి వచ్చేలోగానే.. మొత్తం తమ పెట్టుబడి మొత్తం వచ్చేసేలా నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఒకటిరెండు వారాల్లోనే మొత్తం బిజినెస్ అయిపోతోంది. ఇలాంటి నేపథ్యంలో ఓపెనింగ్స్ దద్దరిల్లేలా.. ఆ చిత్రాన్ని హైప్ చేయడం.. బజ్ క్రియేట్ చేయడం ప్రతి సినిమాకు తప్పనిసరి అయిపోయింది.

ఇటీవలి కాలంలో చూసుకుంటే.. బాహుబలి చిత్రం ఎలా ఉన్నప్పటికీ.. కేవలం దానికి ఆ టీమ్ ఒక స్ట్రాటెజీ ప్రకారం క్రియేట్ చేసిన బజ్ కారణంగా.. బీభత్సంగా ఆడింది. సినిమాలో కంటెంట్‌ను మించి దాని మార్కెటింగ్ టెక్నిక్స్ ఎక్కువ పనిచేశాయంటే… ఆడించాయంటే అతిశయోక్తి కాదు. ఆ స్థాయిలో బజ్ ను ఎవరైనా కోరుకుంటారు. అయితే అలాంటి బజ్ తీసుకురావడంలో ఫెయిల్ అవుతున్నామని ఫీలవుతున్నారట!

అవును మరి! మెగాస్టార్ అంతటివాడితో చిత్రం చేస్తూ.. దానికి తగ్గట్టుగా బజ్ కోరుకోవడంలో తప్పేముంది. మరి ఆ విషయంలో సినిమా టీమ్ ఎందుకు ఫెయిలవుతోందో?

Facebook Comments