బేషరతు పొత్తా? బేషరమ్ పొత్తా?

247

 

కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు షరతుల్లేని (బేషరతు) పొత్తు పెట్టుకుంటున్నారా, లేదా, సిగ్గులేని (బేషరమ్) పొత్తు పెట్టుకుంటున్నారా ప్రజలకు స్పష్టం చేయాలని హరీశ్ డిమాండ్ చేశారు. తెరాస మంత్రి హరీశ్ రావు.. మంగళవారం నాడు తెరాస ఎల్పీ ఆఫీసులో జరిగిన ప్రెస్ మీట్ లో కొత్తగా ఏర్పడినన పొత్తు మీద నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రజలకు ఏం సందేశం ఇవ్వదలచుకుని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబునాయుడుతో పొత్తు పెట్టుకుంటున్నారంటూ  హరీశ్ ప్రశ్నించారు.

హరీశ్ రావు.. మహా కూటమి ఏర్పాటు నేపథ్యం లో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కి పన్నెండు ప్రశ్నలతో బహిరంగ లేఖ సంధించారు. తెలంగాణ సమాజం చంద్రబాబుతో కాంగ్రెస్ పొత్తు పట్ల భయాందోళనల్లో మునగిగిపోతున్నదని, ఈ పరిస్థితుల్లో చంద్రబాబు తో ఎలాంటి కండిషన్లతో పొత్తు కుదుర్చుకున్నారో కాంగ్రెస్ ప్రజలకు చెప్పాలని హరీశ్ అంటున్నారు.

తెలుగుదేశం నేరుగా ఎన్నికల్లోకి వస్తే డిపాజిట్లు కూడా దక్కవనే సంగతి జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనే నిరూపణ అయిందని.. అందుకే చంద్రబాబు ఈసారి కాంగ్రెస్ ముసుగులో వస్తున్నారని ఎద్దేవా చేశారు.

Facebook Comments