స్టార్ హీరోయిన్ల మధ్య మాటల యుద్ధం

152

తనూశ్రీ దత్తా-నానా పటేకర్ ల పంచాయితీ.. ఇప్పుడు బాలీవుడ్ లో పెద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే రోజుకో మలుపు తిరుగుతున్న ఈ వ్యవహారం ఇప్పుడు కంగనారనౌత్, సోనమ్ కపూర్ మధ్య చిచ్చుపెట్టింది. క్వీన్ మూవీ డైరెక్టర్ వికాస్ బెహెల్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని కంగనా కామెంట్స్ చేసింది. ఈ మ్యాటర్ పై వికాస్ ఏం రియాక్ట్ అవ్వలేదు కానీ ఈ మ్యాటర్ తో అసలేం సంబంధంలేని సోనమ్ లైన్ లోకి వచ్చి అడ్డంగా బుక్కయింది. సోనమ్ మాట్లాడుతూ.. ఒక్కోసారి కంగనా కామెంట్స్ ను సీరియస్ గా తీసుకోవడం కష్టమని.. అయినప్పటికీ ఆమె ధైర్యంగా ముందుకొచ్చి కాస్టింగ్ కౌచ్ పై మాట్లాడటం అభినందించదగిన విషయమని చెప్పింది. అయితే
సోనమ్ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న కంగన.. సోనమ్ మాట్లాడిన దాంట్లో అర్థమేంటని ప్రశ్నిస్తోంది. తన మాటలను సీరియస్ గా తీసుకోకూడదా.. అసలు తనను జడ్జ్ చేయడానికి సోనమ్ ఎవరు అని మండిపడుతోంది. కొందరు లేడీస్ ను మాత్రమే నమ్మాలని లైసెన్స్ ఏమైనా ఆమె దగ్గర ఉందా అని సోనమ్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడింది. అంతేకాదు.. దాదాపు పదేళ్ల పాటు సొంతంగా పోరాడి గుర్తింపు తెచ్చుకున్నానని.. సోనమ్ కపూర్ లా తల్లిదండ్రుల పేరుతో పైకి రాలేదని గట్టిగా కౌంటర్ కూడా ఇచ్చి తన కోపాన్ని అంతా వెల్లగక్కింది. దీంతో అసలే గయ్యాలి గంప అని పేరున్న కంగనా గురించి తెలిసి తెలిసి సోనమ్ ఎందుకు పెట్టుకుందని బాలీవుడ్ జనాలు మాట్లాడుకుంటున్నారు. తన జోలికి వస్తే ఎవరినైనా ఉతికి ఆరేస్తుంది కంగనా. గతంలో హృతిక్ రోషన్ తో గొడవ విషయంలో కూడా ఎంతమంది కాంప్రమైజ్ చేయాలని చూసినా కంగనా ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. హృతిక్ ను ఎంత బ్లేమ్ చేయాలో అంత బ్లేమ్ చేసి తన కసి తీర్చుకుంది. ఇక ఇప్పుడు తన మ్యాటర్ లో సోనమ్ అనవసరంగా ఇన్ వాల్వ్ కావడంతో ఈ కాంట్రవర్సీ క్వీన్ ఓ ఆట ఆడేసుకుంటోందని జనాలు చర్చించుకుంటున్నారు. మరి ఈ స్టార్ హీరోయిన్ల వార్ ముందు ముందు ఇంకెంత రైజ్ అవుతుందో చూడాలి.

Facebook Comments