అరవింద..: టైం లేక పాట షూట్ చేయలేదట!

153

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అరవింద సమేత’ సినిమా అక్టోబర్ 11న తెరకెక్కనుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ అందరిని ఆశ్చర్య పరుస్తోంది. ఈ సినిమాలో నాలుగు పాటలు మాత్రమే ఉన్నాయని, ఐదో పాట రీరికార్డింగ్ అయిపోయినా సరే సినిమా లో నుండి మాత్రం తీసేసారని వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. అందుకే ఎలాంటి గొడవలు లేకుండా కేవలం నాలుగు పాటలనే ఆల్బంలో పెట్టినట్టు సమాచారం. త్రివిక్రమ్ మొత్తం 5 పాటలు ప్లాన్ చేశారుట. అందులో మూడు పాటలు ఎన్టీఆర్ డాన్స్ చేసే విధంగా అయితే మిగతా రెండు సిచ్యువేషన్ సాంగ్స్.

ఇదిలా ఉండగా, ‘అరవింద సమేత’ షూటింగ్  ఆలస్యంగా మొదలైనా, వీలైనంత త్వరగా పూర్తి చేశారు. ఎంత వేగంగా చేసినా కొన్ని అనివార్య కారణాల వల్ల షెడ్యూల్స్ అన్నీ అలస్యమవుతూ వచ్చాయి. అందుకే దసరా టార్గెట్ మిస్ అవ్వకూడదు అని శర వేగంగా షూటింగ్ జరుపుతూ వచ్చింది చిత్ర బృందం. షూటింగ్ అంతా పూర్తి చేయగలిగింది కానీ ఓ డాన్స్ సాంగ్ మాత్రం పూర్తి చేయలేకపోయింది. షూట్ చేసే సమయం కూడా లేక పోవడంతో దాన్ని ఏకంగా సినిమా లోంచి తీసేశారట. అయితే ఆ ఐదో పాట సినిమాలో లేక పోయినా సినిమాపై ఎలాంటి ప్రభావం పడదని త్రివిక్రమ్ ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

ఉన్నా లేకున్నా ఒకటే అనిపించే పాటల్ని అసలు ఎందుకు కంపోజ్ చేయించినట్లో?

Facebook Comments