ఇన్సిసార్లు వెనక్కి తగ్గితే.. వీక్ అనుకుంటారబ్బా

164

అక్కినేని యంగ్ హీరో అఖిల్ ఒక్క సూపర్ హిట్ అయినా కొట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు  మొదటి సినిమా ఫ్లాప్ అయింది. రెండో సినిమా కూడా కలెక్షన్ల పరంగా దెబ్బ కొట్టింది. ఇక ఈసారి ఏదేమైనా హిట్ సినిమా తీయాల్సిందే అని పట్టుదలతో ‘తొలి ప్రేమ’ సినిమా ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘మిస్టర్ మజ్ను’ సినిమా చేస్తున్నాడు. ఒక సినిమా హిట్ అవ్వాలంటే కథ, కంటెంట్, నటన, ఎంటర్టైన్మెంట్ ఇలాంటివే కాక టైమింగ్ కూడా కీలకమే. ముందుగా ‘మిస్టర్ మజ్ను’ ను డిసెంబర్ 21 న విడుదల చేద్దాం అనుకున్నారు.

కానీ అదే రోజు వరుణ్ తేజ్, సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో నటించిన ‘అంతరిక్షం’ అలాగే రామ్ హీరోగా వస్తున్న ‘పడి పడి లేచె మనసు’ తో పాటు కొన్ని డబ్బింగ్ సినిమాలు కూడా విడుదల అవ్వనున్నాయి. అందుకే ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 24న విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ బాలకృష్ణ ‘ఎన్టీఆర్’ పార్ట్ 2 ‘మహానాయకుడు’ చిత్రం కూడా అదే రోజున విడుదల అవుతుండడంతో మళ్ళీ ‘మిస్టర్ మజ్ను’  వెనక్కి తగ్గాల్సి వచ్చింది.  ఇక ఏ గోల లేకుండా ఈచిత్రాన్ని ఫిబ్రవరి లో ప్రేమికుల దినోత్సవం కానుకగా విడుదల చేద్దామని దర్శక నిర్మాతలు ఫిక్స్ అయ్యారట. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్.

అయినా ప్రేమికుల దినోత్సవం నాటికి… చాలా ప్రేమ సినిమాలు షెడ్యూల్ అవుతాయి. అఖిల్ మళ్లీ వెనక్కు తగ్గాల్సి వస్తుందో ఏంటో పాపం!

Facebook Comments