ఒకసారి తంతాడు.. ఒకసారి ప్రేమ కురిపిస్తాడు

168

‘NTR’ బయోపిక్ షూటింగ్ తో బిజీగా ఉన్న బాలకృష్ణ.. టైమ్ చూసుకుని పొలిటికల్ టూర్స్ కూడా వేస్తున్నాడు. ఇటీవలే తెలంగాణలో పర్యటించి వచ్చిన బాలయ్య.. మళ్లీ మేకప్ వేసుకుని అన్నగారిలా నటిస్తున్నారు. దివి సీమ ఉప్పెన బాధితులను పరామర్శించే సన్నివేశాలను కృష్ణా జిల్లా హంసలదీవి దగ్గర చిత్రీకరిస్తున్నారట. నాన్న ఎన్టీఆర్ గెటప్ లో ఆ సీన్ చేస్తుండగా.. ఎవరో ఒక నిరుపేద హడావుడిగా వచ్చి ఆయన కాళ్ల మీద పడ్డాడట. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నానని.. తనకు సాయం చేసి పెట్టమని ప్రాధేయపడ్డాడట.ఊహించని ఈ పరిణామానికి షాక్ అయిన బాలయ్య ఆ తర్వాత తేరుకుని చాలా శాంతంగా.. అతని అనారోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నాడట. వెంటనే బసవ తారకం క్యాన్సర్ హాస్పటల్ డాక్టర్లతో మాట్లాడి అతనికి మంచి వైద్యం అందించాలని కోరాడట.

అంతేకాదు.. అతడిని అప్పటికప్పుడు హైదరాబాద్ పంపించే ఏర్పాట్లు కూడా చేశాడని తెలుస్తోంది. ఈ వ్యవహారమంతా ఎవరో క్లిక్ మనిపించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఫోటోలతో సహా బాలయ్య చేసిన సాయం మీడియాకు లీక్ కావడంతో ఒక వర్గం మీడియా.. ఆయన్ను మనసున్న మారాజు అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

అరవింద..: టైం లేక పాట షూట్ చేయలేదట!

నిజంగా ఒక క్యాన్సర్ బాధితుడికి అండగా నిలిచినందుకు బాలయ్యకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే. అలాగే తన మీద ప్రేమతో.. అభిమానంతో వచ్చే వారిని కొట్టడం, తిట్టడంలాంటివి ఎందుకు చేస్తుంటాడు అనే విషయం కూడా ఇప్పుడు చర్చకు వస్తోంది. ఎందుకంటే మొన్నటికి మొన్నే ఖమ్మం జిల్లాలో ప్రచారానికి వెళ్లినప్పుడు కూడా ఒక అభిమానిని కాలితో తన్నాడు బాలయ్య. దానికి ఆగ్రహించిన ఆ అభిమాని అక్కడిక్కడే ఈ హీరో ఫ్లెక్సీలను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశాడు.

ఇదే కాదు.. కోపంతో అభిమానులపై రెచ్చిపోయిన సందర్భాలు కొకొల్లలు. ఆ వీడియోలు అన్ని యూ ట్యూబ్ లో దర్శనమిస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఒక మంచి చేయగానే.. అహా.. ఓహో అంటే బాలయ్యను పొగిడేసే వాళ్లంతా.. అభిమానులపై చేయి చేసుకున్నప్పుడు ఎందుకు ఖండించరు అని కొంతమంది వాదన. అయినా ఈ ఒక్క సీన్ తో బాలయ్యపై ఉన్న ఇంప్రెషన్ పోవడం కష్టమనే భావనే అందరిలోనూ ఉంది.

Facebook Comments