కాంగ్రెస్ ను బెదిరిస్తే, తెదేపా బతిమాలుతోంది!

31

తెలంగాణలో ఏర్పడిన కొత్త మహా కూటమికి సారథి కాంగ్రెస్. సీట్లు ఇచ్చే పొజిషన్ లో ఉన్నది కాంగ్రెస్ పార్టీనే. అంతమాత్రాన.. వారు అహంకారంతో ప్రవర్తిస్తే.. కూటమికే చేటు అనేది అందరికీ తెలిసిన సంగతే. కానీ కాంగ్రెస్ మాత్రం ఆ చేటు దిశగానే అడుగులు వేస్తోంది. తమ పార్టీ వ్యూహల్లో వారు మునిగిపోయారే తప్ప.. అసలు భాగస్వామ్య పార్టీలకు సీట్ల పంపకం సంగతి తేల్చలేదు.
ఈ నేపథ్యంలో తెజస అధినేత కోదండరాం కాంగ్రెస్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 48 గంటల్లోగా సీట్ల పంపకం సంగతి తేల్చకపోతే.. తెజస సొంతంగా పోటీచేస్తుందని ముందుగా 21 మంది అభ్యర్థులతో జాబితా ప్రకటించేస్తామని కోదండరాం హెచ్చరిస్తున్నారు. జాబితా సిద్ధం చేసి ఉంచుకున్న కోదండరాం… కాంగ్రెస్ తేల్చకపోతే.. భావసారూప్య పార్టీలతో ముందుకెళ్తానని కూడా అంటున్నారు.

మోడీని ఎలా నమ్మడం?

తమాషా ఏంటంటే.. సీట్లు తేల్చాలంటూ కోదండరాం, కాంగ్రెస్ ను బెదిరిస్తోంటే, ఆ పార్టీనుంచి మాత్రం ఎలాంటి స్పందన రావడం లేదు. మధ్యలో తెలుగుదేశం తలదూర్చి, కోదండరాంను బుజ్జగించడానికి, బతిమాలడానికి ప్రయత్నిస్తోంది. తొలినుంచి కోదండరాంను తెదేపా మాత్రమే బతిమాలుతోంది. కాంగ్రెస్ అంటీముట్టనట్టు ఉంటోంది. పట్టించుకోవడం లేదు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ కు కోదండరాం లేఖ రాస్తే, ఎల్.రమణ ఆయనతో భేటీ అయి సర్ది చెబుతున్నారే తప్ప.. కాంగ్రెస్ పట్టించుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మహాకూటమి మరో ముందడుగు వేసేలా కుప్పకూలిపోయే వాతావరణమే కనిపిస్తోంది.

Facebook Comments