నాగం జనార్దనరెడ్డి కుమారుడి దుర్మరణం

55

నాగం జనార్దనరెడ్డి కుమారుడు దినకర్ రెడ్డి.. అనారోగ్యంతో గురువారం రాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దినకర్ రెడ్డి.. హైదరాబాదు అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం రాత్రి మరణించారు. సంగతి తెలిసిన పలువురు ప్రముఖులు, సీనియర్ నాయకులు తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ.. నాగంకు సంతాపం తెలియజేశారు.

కొన్ని నెలలుగా దినకర్ రెడ్డి ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం. వైద్యం ఫలించకపోవడంతో చివరికి ఆయన కన్నుమూశారు. కొడుకు మరణంతో నాగం కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

 

Facebook Comments