బీఎస్సార్ :: గద్దరన్న..

428

గద్దరన్న కడుతుండో ఖద్దరు పంచీ..
మలి సంజె వేళలో రాజకీయాలే నచ్చి..
మమకారమేమో గుర్తుకొచ్చి..
కడుపుతీపి మీద ప్రేమ పుట్టుకొచ్చి..
కాంగ్రెస్స్ కండువాలో కలరెంతో మెచ్చి.. (గద్దరన్న..)

నీ మాటలే తూటాలై పేలంగా..
నీ పాటలే కత్తులై గుచ్చంగా..
పోరుబాట పట్టిండ్రో కుర్రకారంతా నాడు..
పేణాలే పణంగా పెట్టిండ్రో.. మరిచితివా నేడు.. (గద్దరన్న..)

త్రివిక్రమ్… గాయాలను గెల‌క్కండి!

పీఠాల చుట్టూ తిరిగి
పంతుళ్ళకేమో మొక్కి
నెత్తిన అక్షింతలే పట్టి..
దేవుళ్ళకేమో దండాలు పెట్టి..
విప్లవానికేమో నీళ్ళే విడిచిపెట్టి… (గద్దరన్న..)

మహాకూటమిని వెనక్కు లాగేదెవరు?

బేలట్ రాజకీయాలొద్దంటూ..
బుల్లెట్ రాజకీయాలే ముద్దంటూ..
నాడేమో కాలికి గజ్జె కడితివి…
నేడేమో.. భార్యా బిడ్డలతోటి
ఢిల్లీ ఫ్లయిట్ ఎక్కేసి
కాంగ్రెస్సోడి గుమ్మాన
విప్లవానికి పాతరేస్తివి… (గద్దరన్న..)

ఆబ్బె.. కాంగ్రెస్స్ గూడు
లేదులేదంటూనే..
గజ్వేల్ కోటలో సీఎం దొరమీదే
ఇండిపెండెంట్ గానైనా
రచ్చలోకి దిగుతానంటూ..
గజ్జెల సవ్వడి చేస్తుండవ్.. (గద్దరన్న..)

అన్నా,,, నిన్ను నమ్మినం..
నిన్ను మెచ్చినం..
నీతో చిందులేసినం..
ఎన్ని చేసిన..
తుంచేస్తివి గదే విప్లవ మొగ్గని..
తొక్కేస్తివి గదే ఆ ఎర్ర జెండాని..
కంట నీరు రావట్లేదే.. ఇప్పుడు..
అమర వీరుల రుధిర జలాలే
రాలుతున్నాయ్ గుప్పెడు.. (గద్దరన్న..)

… బి. శ్రీనివాసరావు

Facebook Comments