‘కండ’రగండడు గా నాగశౌర్య

180

హీరో నాగశౌర్య అంటే ఫ్రెండ్లీగా కనిపించే పక్కింటి అబ్బాయి లాంటి పాత్రలతో మాత్రమే ఇప్పటిదాకా అందరికీ తెలుసు. ఇప్పటిదాకా తను చేసినవి అన్నీ కూడా దాదాపుగా.. ఫ్యామిలీ మొత్తం హాయిగా ఎంజాయి చెయ్యగల సినిమాలే. ఇటీవల తమ సొంత బ్యానర్ లో తల్లిదండ్రులే నిర్మాతగా నర్తన శాల చిత్రం చేసిన నాగశౌర్య ఇప్పుడు ఇమేజి మేకోవర్ ప్రయత్నాల్లో ఉన్నట్లుగా అనిపిస్తోంది.

ఇది కూడా చదవండి

త్రివిక్రమ్… గాయాలను గెల‌క్కండి!

ఇన్నాళ్లూ సాఫ్ట్ కేరక్టర్ లతో తనకంటూ సొంత ఫ్యాన్ బేస్ ను తయారుచేసుకున్న నాగశౌర్య ఇప్పుడు యాక్షన్ హీరోగా అవతారమెత్తే ప్రయత్నాల్లో ఉన్నాడా? అనే అభిప్రాయం కలుగుతోంది. ఎందుకంటే.. ఈ హీరో ఇప్పుడు విపరీతంగా జిమ్ వర్కవుట్లు చేస్తూ.. కండలు పెంచే పనిలో ఉన్నాడు.

2011లో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నాగశౌర్య ఈ ఏడేళ్లలో మొత్తం 17 చిత్రాలు చేశాడంటే నమ్మశక్యంగా ఉండదు. ఊహలు గుసగుసలాడే చిత్రతో లైమ్ లైట్ లోకి వచ్చిన తర్వాత.. వెనుదిరిగి చూసుకోకుండా నాగశౌర్య ప్రస్థానం సాగుతోంది.

నర్తనశాలతో సొంత బ్యానర్ చిత్రాలు చేయడం ప్రారంభించిన నాగశౌర్య , తన తర్వాతి చిత్రం కూడా సొంత బ్యానర్ లోనే చేస్తుండడం విశేషం. ‘ఘన’ అనే టైటిల్ తో ఈ చిత్రం రూపొందబోతోంది. దీనికోసం హీరో భారీగా జిమ్ వర్కవుట్లు చేస్తున్నాడు. యాక్షన్ హీరో రేంజిలో కండలు పెంచుతున్నాడు. మరి ఈ ‘ఘన’ ఎలాంటి జోనర్ తో అతని అభిమానుల్ని మెప్పిస్తుందో చూడాలి.

Facebook Comments