మన ప్రజల పార్టీ ప్రజా పార్టీ

245

తెలంగాణ ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు…వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపేదుకు ఆచరాణ సాధ్యమైన ఆలోచనలు..సమాజ శ్రేయస్సే కు పనికొచ్చే మ్యానిఫెస్టోతో ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధే లక్ష్యంతో ప్రజా పార్టీని స్థాపిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే అనేక పార్టీలు ఉన్నాయి… మళ్లీ కొత్తపార్టీ ఎందుకు అనే ప్రశ్న
మీలో రావచ్చు. తెలంగాణ గడ్డమీద చదువు సంధ్యలు పూర్తి చేసుకుని..విదేశాల్లో ఉద్యోగాలు, వ్యాపార రంగాల్లో సేవలు అందించి మళ్లీ పుట్టినగడ్డ రుణం తీర్చుకునేందుకు కొత్తపార్టీ స్థాపిస్తున్నాం. మన రాష్ట్రంలో పరిస్థితులు..ఇక్కడ ప్రజలు, పాలకులు వ్యవహారశైలి … వివిధ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులు సమగ్రంగా అవగాహన చేసుకున్నాం. సామాజిక,ఆర్ధిక,రాజకీయ, వ్యవసాయ,విద్యా, వైద్య, వ్యాపార, పన్నులు ఇలా అన్ని అంశాలపై లోతైన విశ్లేషణ చేశాం. అన్నీ చూశాక మన తెలంగాణ ప్రజలు , రాష్ట్రం ఇంకా ఎంతో ప్రగతి సాధించాలనే మహాన్నత లక్ష్యాన్ని సాకారం చేసే ప్రయత్నంలో ఈకొత్త పార్టీ ఆవిర్భవిస్తోంది. రాబోవు ఎన్నికల్లో తాము పోటీచేసి మార్పు ఎలా తీసుకురావాలో ప్రతి ఒక్కరికి ఒక దిశానిర్దేశం చేసే విధివిధానాలతో ప్రజల ముందుకు వస్తున్నాం. రాష్ట్రంలో జరగే ఈ ఎన్నికల్లోనే తమ పార్టీ అభ్యర్ధులు పోటీ చేయబోతున్నారు. పార్టీ నిర్మాణం, ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధుల కసరత్తు శరవేగంగా సాగుతోంది.

మీకు తెలుసా?
నువ్వు ఉదయం నిదుర లేచినప్పటినుండి చేసే ప్రతి పనిలో ప్రభుత్వానికి కి టాక్స్ కట్టే పని చేస్తావని?
నీ కష్టంతో సంపాదించిన ధనం నుండి, నువ్వు పొందుతున్న ప్రతి సేవకి ప్రభుత్వానికి టాక్స్ కడుతున్న సంగతి ఎప్పుడైనా సరిగా గమనించావా? నువ్వు కట్టే టాక్స్ తోనే ప్రభుత్వం చేసే ప్రతి పనికి, నీ సంపాదన నుండే ఖర్చు చేస్తారన్న సంగతి నీకు తెలుసా?

ఓట్లు వెయ్యండంటూ మన ముందుకి అనేక పార్టీల వాళ్లు, వారి ఆలోచనలతో ఎన్నికల మ్యానిఫెస్టో తో వస్తారు…
నీ టాక్స్ తో నడిచే ఈ ప్రభుత్వాలు… నీకేం కావాలో, ఏం వద్దో కూడా నీ ప్రమేయం లేకుండా వాళ్లే నిర్ణయించేస్తారు. ఎంత దుర్మార్గం? ఎంత మోసమో కదా!

అందుకే… ప్రజల టాక్స్ ప్రజల అవసారాలు తీర్చే విధంగా… ప్రభుత్వాలు పనిచేసే విధంగా… ప్రజా పార్టీపనిచేస్తుంది. ప్రజలు చెల్లించే ప్రతి పైసా ప్రజాసంక్షేమానికే ఉపయోగపడాలనేది మా లక్ష్యం. ప్రజాకర్షక పథాకాలు కాకుండా పదికాలాల పాటు ప్రజలు బాగుండేవిధంగా.. ప్రజలు స్వయం సంవృద్ధి సాధించే విధంగా ప్రజా పార్టీ పనిచేయబోతోంది. అందుకే మాకున్న ఆలోచనలే కాకుండా ప్రజల దగ్గర నుండే మ్యానిఫెస్టో తీసుకుని, అదే మ్యానిఫెస్టో “ప్రజా పార్టీ” మ్యానిఫెస్టో గా రూపొందించడం, అమలు పరచడం అనే లక్ష్యంతో మన “ప్రజా పార్టీని” స్థాపించడం జరిగింది.

అంతే కాదు… ఓట్ల కోసం ప్రజాకర్షక పథకాలు రూపొందించడం కాకుండా… సంపద శ్రుష్టించడం, ఆ సంపదను ప్రజలందరి మౌళిక వసతులు తీర్చే విధంగా, జీవన ప్రమాణాలను పెంపొందిస్తూ… ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి పైసాకి జవాభుదారీ ఉండే విధంగా… ప్రభుత్వాలు నడపాలనే లక్ష్యంతో “ప్రజా పార్టీ” స్థాపించడం జరిగింది.
ప్రజలు సంపదని శ్రుష్టించాలి. ప్రజలకి ప్రభుత్వాలు అన్ని వేళల సౌకర్యాలు కల్పిస్తూ… ప్రజలకి ఎప్పటికప్పుడు కావలసిన నైపుణ్యాన్ని, సంపద సంపాదించడానికి కావలసిన సహకారం ప్రభుత్వం ఇస్తే చాలు… ఈ దేశంలో వనరులకి, మేధస్సుకి కొదవ లేదు… ఆలాంటప్పుడు ఈ ప్రభుత్వాలు ఇచ్చే ఉచ్చిత హామీలు ప్రజలకి అవసరం లేదు, కావలసింది జవాభుదారితనమే అని నమ్మి…. “ప్రజా పార్టీ పనిచేస్తుందని మేము హామీ ఇస్తున్నాం.

ఇట్లు
అజీజ్ మహమ్మద్ ;
వ్యవస్థాపక అధ్యక్షుడు.

Facebook Comments