జగన్ చారిత్రాత్మక విజయం

61

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో చారిత్రాత్మక విజయం సాధించారు. 175 శాసనసభ సీట్లున్న కొత్త ఆంధ్రప్రదేశ్ లో 151 సీట్లలో విజయం సాధించడం ద్వారా తనకున్న ప్రజాబలం ఏంటో నిరూపించుకున్నారు. గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీకి దక్కిన ఆధిక్యం కంటె… ఈసారి అనూహ్యంగా జగన్ మెజారిటీ సాధించడం విశేషం. భవిష్యత్తులో కూడా ఇంత భారీ వ్యత్యాసంతో మరో పార్టీ గెలుపొందడం అసాధ్యం అనిపించగల స్థాయిలో జగన్మోహన్ రెడ్డి… భారీ మెజారిటీతో ముఖ్యమంత్రి కాబోతున్నారు.

తెలుగు రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఇది చారిత్రాత్మక విజయం అని చెప్పాలి. చంద్రబాబునాయుడు పాలనను ప్రజలు ఎంతగా తిరస్కరిస్తున్నారనడానికి ఇది నిదర్శనం. నలభయ్యేళ్ల సుదీర్ఘ అనుభవం తర్వాత… చంద్రబాబు ఇప్పుడు దక్కిన ఓటమి నుంచి ఇక పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. కనీసం ఆయన కు దక్కిన పరాభవం నుంచి ఇతరులు పాఠాలు నేర్చుకుంటే బాగుంటుంది.

వాస్తవమైన ప్రజాపరిపాలన కాకుండా.. కేవలం మాటల గారడీతో మాయ చేయాలని చూస్తే ప్రజలను మభ్యపెట్టడం కలకాలం సాధ్యం కాదని చంద్రబాబునాయుడు కు ఎదురైన ఓటమి నుంచి ఇతరులు పాఠాలు నేర్చుకోవాలి. వర్తమాన రాజకీయాలకు చంద్రబాబు ఓటమి ఒక పెద్ద లెసన్ అనుకోవాలి. ఆయనలాగా పరిపాలించడం ప్రజలను మోసం చేయడం అనేది షార్ట్ టర్మ్ లో ఫలితం ఇస్తుంది గానీ… లాంగటర్మ్ లో ఖచ్చితంగా దెబ్బ కొడుతుందని ఇతరులు తెలుసుకోవాలి.

Facebook Comments