పదవులిస్తే చాలదు… అధికారాలూ ఇవ్వాలి!

50

జగన్మోహన్ రెడ్డి తన సర్కారులో అయిదుగురు మంత్రులకు డిప్యూటీ సీఎం హోదా కట్టబెట్టబోతున్నట్లుగా ప్రకటించారు. అందులో కులాల సమతూకం పాటిస్తున్నట్లు కూడా వెల్లడించారు. అయితే డిప్యూటీ పదవులు అనేది కులాల వాటా ప్రకారం మొక్కుబడిగా ఇచ్చినట్లుగా కాకుండా.. వారి పదవులకు తగిన అధికారాలు, ప్రాధాన్యం కూడా ఇస్తేనే సబబుగా ఉంటుంది.

చంద్రబాబు ప్రభుత్వంలో కూడా.. ఇదేమాదిరి కులాల సమతూకం పాటిస్తూ… ఒక బీసీ, ఒక కాపు ఉప ముఖ్యమంత్రి ఉండేవారు. పేరుకు వారు ఉప ముఖ్యమంత్రులే తప్ప వెలగబెట్టిందేమీ లేదు. ఉత్సవ విగ్రహాల్లాగా ఉండిపోయారు. జగన్మోహన్ రెడ్డి.. బీసీ, కాపు లతో పాటూ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు జగన్ చోటు కల్పించనున్నారు.

Facebook Comments