దోపిడీ అరికట్టడం ఇలాగేనా?

104

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న తాజా నిర్ణయం సర్వత్రా విమర్శలకు గురవుతోంది. ప్రభుత్వ, ప్రెవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లులకు ఏడాదికి 15వేల రూపాయలు ఇచ్చే ఆలోచనను ప్రజలు దెప్పి పొడుస్తున్నారు. ఇది ప్రభుత్వ పాఠశాలలను కుప్పకూల్చేలా ఉన్నదని ఉపాధ్యాయులే మండిపడుతున్నారు. ప్రజలకు బిస్కట్ లు వేయడం అనేది ఇవాళ్టి రాజకీయాల్లో కొత్త సంగతి కాదు గానీ… అందుకోసం ప్రభుత్వ వ్యవస్థల్ని కుప్పకూల్చి సర్వనాశనం చేసే హక్కు మాత్రం ఎవ్వరికీ లేదని వారు ప్రశ్నిస్తున్నారు.

జగన్ అవినీతిన లేని పాలన అందిస్తానని అన్న రోజున నిజమే కాబోలు అనుకున్న వాళ్లు చాలా మందే ఉన్నారు. ఇంకా సుదీర్ఘకాలం రాజకీయ భవిష్యత్తు ఉన్నది గనుక.. చాలాకాలం పాటు సీఎం పదవిని కోరుకుంటున్నాడు గనుక… అంత ఈజీగా అవినీతికి పాల్పడడని ప్రజలు అనుకున్నారు. కానీ ప్రెవేటు స్కూళ్లలో చదివే పిల్లలకు కూడా ఏడాదికి 15వేలు ఇవ్వడం తప్పు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి నిర్ణయం వలన ఇప్పటిదాకా ప్రభుత్వ స్కూళ్లకు వస్తున్న పిల్లలు కూడా ఇకపై ప్రెవేటు స్కూళ్ల బాట పట్టే అవకాశం ఉన్నదని అంటున్నారు.

ప్రెవేటు స్కూళ్లకు వెళ్లే వారికి కూడా ప్రభుత్వ సొమ్ము దోచిపెట్టడం గురించి జగన్మోహన్ రెడ్డి పునరాలోచించుకుంటే ఆయన ప్రభుత్వ భవితవ్యం బాగుంటుంది.

Facebook Comments