నవకవిత : బూజు మీదనే మోజు

40

పువ్వు గుర్తు పార్టీలో… మొగ్గ తొడుగుతోంది ఆశ

పర నాయక హరణం… మీద సదా ధ్యాస!

తెలుగు నేలలో జెండా… పాతాలని ఉంది మోజు

అట దొరికే సరుకంతా… పాతాళంలోని బూజు!!

కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ప్రత్యర్తి పార్టీలను దెబ్బతీస్తూ ఫిరాయింపులకు ఎగబడుతున్న భారతీయ జనతా పార్టీ.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయంగా అత్యంత యాక్టివ్ గా కనిపిస్తున్న పార్టీ భాజపా మాత్రమే. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రస్తుతానికి అధికారం దక్కిపోయింది గనుక నిమ్మళంగానే ఉంది. అదే సమయంలో ఓడిపోయిన తెలుగుదేశం స్తబ్ధుగా ఉంది. ఎటొచ్చీ.. రాష్ట్రంలో భవిష్యత్తు మీద భయంతో, గత్యంతరం లేని స్థితిలో మిగిలిపోయిన నాయకులందరినీ తమలో కలిపేసుకోవడానికి భారతీయ జనతా పార్టీ మాత్రమే చాలా యాక్టివ్ గా ఉంది.

తెలుగుదేశం ఎమ్మెల్యేలు కొందరు భాజపాలో చేరడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఎటొచ్చీ.. అనర్హత వేటు పడుతుందనే భయమే వారిని వెనక్కు లాగుతోంది. అనర్హత వేటు పడకుండా.. తమను కాపాడే బాధ్యత అమిత్ షా తీసుకుంటే గనుక.. తక్షణం తెలుగుదేశాన్ని వీడడానికి నాయకులు పెద్ద సంఖ్యలోనే సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ క్రమంలో.. మరింత ముందుకు సాగిన తర్వాత నియోజకవర్గాల్లో రెండోశ్రేణి నాయకత్వం మొత్తం భాజపాలోకి వలసకట్టినా ఆశ్చర్యం లేదు. కానీ.. తెలుగుదేశం పార్టీ ప్రజల్లో చెల్లనిరూపాయే అయింది. ఆ పార్టీలోని కొందరు నాయకులు ప్రజలు తిరస్కరించిన బూజు కిందే లెక్క. మరి ఆ బూజు మీద భాజపా మోజు పడుతోంది. చేర్చుకోవడం ఓకే గానీ, బూజు దులిపి శుభ్రం చేసుకోకుంటే.. వారికి పెద్ద లాభం ఉండదు.

Facebook Comments