కేరళ అడవుల్లో ఎర్రచందనమా? హవ్వ!

33

దర్శకుడు సుకుమార్, బన్నీ కాంబినేషన్ లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో చిత్రం ముహూర్తం జరుపుకున్న సంగతి అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. అయితే ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా తీస్తూ.. ఫారెస్టు బ్యాక్ డ్రాప్ కోసం కేరళ అడవులకు వెళుతుండడమే చిత్రంగా ధ్వనిస్తోంది.

చిత్తూరు జిల్లా లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంగా కథ సాగుతుంది. స్థానికంగా కూడా చిత్తూరు జిల్లాకు చెందిన పలువురిని ఆడిషన్ల ద్వారా వివిధ చిన్న చిన్న పాత్రలకు సుకుమార్ తీసుకున్నారు. ఇదంతా బాగానే ఉంది గానీ.. అడవులను మాత్రం కేరళ నుంచి ఎందుకు ఎంచుకుంటున్నారనేదే సందేహం.

సాధారణంగా తిరుపతి పరిసరాల్లో చిత్తూరు జిల్లాలో ఉండే శేషాచలం అడవుల్లో మాత్రమే ఎర్రచందనం లభిస్తుందని ప్రతీతి. ఎర్రచందనం చెట్టును చూడగానే గుర్తుపట్టవచ్చు. ఆ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా తీస్తే.. అలాంటి అడవులను ఎంచుకోవాలి. చిత్తూరు జిల్లా- కడపజిల్లాల్లో విస్తరించి ఉండే అడవులనే ఎంచుకుంటే.. సహజంగా ఎర్రచందనం చెట్లు కనిపిస్తాయి. కానీ కేవలం అడవుల చిక్కదనం చక్కదనం కోసం కేరళ వెళుతున్నట్లుగా ఉంది.

సాధారణంగా సహజత్వానికి పెద్దపీట వేసే సుకుమార్ ఇలాంటి ఆలోచనతో ఎందుకు చేస్తున్నట్లో ?

Facebook Comments