ఓఫియుచస్‌లో విశ్వంలో అతి పెద్ద పేలుడు!

46

ఖగోళశాస్త్రజ్ఞులు విశ్వంలో అతిపెద్ద పేలుడుని కనిపెట్టారు. ఆ పేలుడు ఒక సుదూర గెలాక్సీ క్లస్టర్ నుండి ఉద్భవించింది, మరియు దానిని పూణేలోని జైంట్ మీటర్ వేవ్ రేడియో టెలిస్కోప్ (జీ.ఎమ్.ఆర్.టీ.) తో సహా నాలుగు వేర్వేరు వేధశాల(అబ్జర్వేటరీ)లో పరిశీలించడం జరిగింది. ఈ పేలుడు, భూమి నుండి 390 మిలియన్ కాంతి సంవత్సరాలు దూరంలో ఉన్న ఓఫియుచస్ గెలాక్సీ క్లస్టర్ లో జరిగినట్లుగా పరిశీలించడమైంది. నాసా వారి చంద్రా-ఎక్స్ రే వేధశాలలో, 2016 లో, మొదటిసారి కనుగొనడం జరిగింది. జీ.ఎమ్.ఆర్.టీ కాకుండా, ఈ పేలుడుని ఎక్స్.ఎమ్.ఎమ్-న్యూటన్ మరియు మర్చిసన్ వైడ్ ఫీల్డ్ అరే (ఎమ్.డబ్యూ.ఏ), ఆస్ట్రేలియా లో పరిశీలించారు. దీని గురించి ఒక పరిశీలనను ది ఆస్ట్రోఫిజిక్స్ జర్నల్ లో పబ్లిష్ చేశారు.
నాసా ద్వారా ముందుగా చేయబడిన పరిశీలన ప్రకారం, చంద్రా వారి పరిశోధకులు ఓఫియుచస్ లో ఒక అసాధారణంగా వంగి ఉన్న అంచును గమనించారు. వాళ్లు ఇది ఒక సూపర్ మాసివ్ బ్లాక్ హోల్ ద్వారా వెలువడే వేడి గాలి వల్ల వచ్చిన కావిటీ అని భావించారు. కానీ వాళ్లు ఆ విషయాన్ని నిర్ధారణ చేసుకోలేదు. కానీ, ఈ మధ్య చేసిన పరిశీలన ప్రకారం, ఇది ఒక ఖగోళ పేలుడు వల్ల జరిగిందని తెలుసుకున్నారు. వాళ్లు మొదట, ఈ వంగి ఉన్న అంచు గురించి ఎక్స్.ఎమ్.ఎమ్-న్యూటన్ ద్వారా వాళ్ల అభిప్రాయాలని ధృవపరచుకున్నారు. తరువాత, భారత దేశంలోని జీ.ఎమ్.ఆర్.టీ, మరియు ఆస్ట్రేలియా లోని ఎమ్.డబ్యూ.ఏ నుంచి వచ్చిన రేడియో ను ఉపయోగించి ఈ వంపు రేడియో ఉద్గారాలతో నిండిన ప్రాంతం పక్కన ఉందని తెలుసుకున్నారు. ఎక్స్-రే డేటా తో పాటు, ఈ పరిశీలన మునుపటి పరికల్పనను ధృవీకరించింది.
ప్రస్తుతం ఈ గెలాక్టిక్ క్లస్టర్ లో అంతా ప్రశాంతంగానే ఉంది. కావిటీ నుంచి వచ్చిన రేడియో ఉద్గారాలు కాంతి వేగంతో ప్రయాణిస్తున్న ఎలెక్ట్రాన్స్ అని, వాటికి వేగవృద్ధి (ఆక్సిలరేషన్) ఒక బ్లాక్ హోల్ లోని పెద్ద పేలుడు ద్వారా వచ్చిందని, పరిశోధకులు తెలుసుకున్నారు. ఈ బ్లాక్ హోల్ ని పరిశోధకులు ఒక యాక్టివ్ గెలాక్టిక్ న్యూక్లియస్ అని వివరిస్తున్నారు. ఈ కావిటీ నిర్మాణము స్లోషింగ్ అనే ఒక ప్రక్రియ ద్వారా వచ్చిందని పరిశోధకులు తెలుసుకున్నారు. వాళ్లు ఈ ప్రక్రియ పేలుడుకి పరిణామముగా జరిగిందని అనుకుంటూ ఉండగా, ఈ ప్రక్రియ రెండు గెలక్సీలు విలీనం అయినప్పుడు వస్తుందట.
ముందుగా రికార్డ్ హోల్డర్ అయిన అత్యంత శక్తివంతమైన పేలుడుకన్నా, ఈ పేలుడు రికార్డు బద్దలుకొడుతూ పాత దానికన్నా దాదాపు 5 సార్లు పెద్దదని శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. ఈ పేలుడు గురించి నాసా మరియు చంద్రా వేధశాల వారు ట్విటర్ లో ట్వీట్ చేశారు.

Facebook Comments