ఆ చావుకి కొరోనా కారణం కాదు!

29

36 ఏళ్ల జైనేష్, మలేషియా నుంచి తిరిగి వచ్చి ఫ్లైట్ దిగగానే, తనని ఎర్నాకులమ్ లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో అడ్మిట్ చేశారు. అతనికి కొరోనా వైరస్ ఉందని తెలియడంవల్ల అతనిని పరిశీలనలో ఉంచారు. ఫిబ్రవరి 28న కొచ్చి ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత అతనిని అడ్మిట్ చేయడం జరిగింది. కన్నూర్ కు చెందిన జైనేష్, శుక్రవారం రాత్రి కన్ను మూశాడు. అయితే, ఫలితాల ప్రకారం, జైనేష్ చావుకి కారణం కొరోనా వైరస్ కాదని, దాని బదులు న్యుమోనియా మరియు శ్వాసకోస వైఫల్యం అని కేరళ ఆరోగ్య మంత్రి కె.కె.శైలజ తెలిపారు. కొరోనా వైరస్ కోసం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (పూనే) ద్వారా జరిగిన రెండు టెస్టులూ ప్రతికూలంగా ఉన్నాయని కూడా ఆమె తెలిపారు.
ప్రస్తుతం, కేరళలో 206 మంది కొరోనా వైరస్ కోసం పరిశీలనలో ఉన్నారు. వీళ్లలో 193 మందిని ఇంటిలోనే పరిశీలనలో ఉంచివుంటే, మిగిలిన 13 మంది ఆస్పత్రులలో ఉన్నారు.
మొత్తంగా 488 కొరోనా వైరస్ సోకినట్లు అనుమానిస్తున్న నమూనాలను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపిస్తే, వీటి నుంచి 471 నమూనాలు ప్రతికూలంగానే ఉన్నాయి. ప్రస్తుతం ఆస్పత్రులలో ఉన్నవారికి ఎలాంటి ప్రాణభయమూ లేదు అని ఆరోగ్య విభాగం తెలిపింది.

Facebook Comments