మేఘాలయాలో జమ్మూ-కశ్మీర్ పరిస్థితేనా??

27

ఆదివారం రోజు తూర్పు ఖాసీ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ షిల్లాంగ్ లో చాలా ప్రాంతాలలో రాత్రి కర్ఫ్యూని పొడిగించి, రెండు పోలీస్ స్టేషన్లలో సోమవారం ఉదయం వరకూ పూర్తిస్థాయి కర్ఫ్యూ విధించారు. మొబైల్ ఇంటర్నెట్ సేవలు కూడా రద్దయ్యాయి. ఒప్పటిదాకా జమ్మూకాశ్మీర్ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించకుండా.. ఆ ప్రాంతంలో ఏం జరుగుతోందో తతిమ్మా దేశానికి తెలియనివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న కేంద్రం మేఘాలయలోనూ అదే పరిస్థితిని సృష్టిస్తోంది.

బాంగ్లాదేష్ సరిహద్దుల దగ్గర ఉన్న షెల్లా అనే ఊరి దగ్గర ఉఫాస్ ఉద్దీన్ ని తను నిద్రలో ఉండగా కత్తిపోటుతో చంపేశారు. 28 ఏళ్ల ఆదిత్య కుమార్ షిల్లాంగ్ పొరుగుల్లో విరిగిన గాజు సీసాతో పొడిచి చంపివేయబడ్డాడు. రజువా కరీమ్ అనే 31 ఏళ్ల గవర్నమెంట్ ఎమ్ప్లాయీ ఖాసీ కొండల దగ్గర దాడి చేయబడ్డాడు. ఇలా మూడు రోజులుగా మేఘాలయాలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాగే ఖాసీ కి చెందిన లుర్షాయి హైన్నియెవ్టా కూడా చంపబడ్డాడు.

ఖాసీ స్టూడెంట్స్ యూనియన్ (కే.ఎస్.యూ) అనే ఒక ప్రభావంతమైన స్టూడెంట్ బాడీ తమ మీటింగ్ లో సిటిజెన్షిప్ ఆక్ట్ కు వ్యతిరేకంగా వెళ్లి, ఇన్నర్ లైన్ పర్మిట్ పాలనను అమలు చేయాలని డిమాండ్ చేసింది. దీని ద్వారా గొడవలు జరిగి అదూ గొడవలలో చాలా మంది చనిపోయారు. పోలీసులు ఆ యూనియన్ వాళ్లు వేరే వాళ్లని రెచ్చగొట్టారని, దీని ద్వారా హింస జరిగిందని చెప్పినా, కే.ఎస్.యూ ఇదంతా ఒక ప్రణాలిక ప్రకారం జరిగిందని, చెబుతున్నారు. తూర్పు ఖాసీ కొండల్లో, ఇచామటి అనే టౌన్ లో శుక్రవారం రోజు ఘర్షణలు జరిగాయి. ఈ టౌన్ లో మెజారిటీ నాన్-ట్రైబల్ జనాభానే ఉంది.

షిల్లాంగ్ మరియు ఆ రాష్ట్ర ఇతర ప్రాంతాలలో నాన్-ట్రైబల్ మనుషులున్న ప్రాంతాలలో భద్రతను బలంగా అమలుపరిచారని ఒక పోలీస్ అధికారి తెలిపారు. పోలీసులు తాము ఉఫాస్ ఉద్దీన్ చావును గురించి కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఉఫాస్ చావు పశువుల అక్రమ రవాణాతో ముడిపడి ఉందని పోలీసులు అనుకుంటున్నారు. వాళ్ల ప్రకారం, ముగ్గురు గుర్తు తెలియని దుండుగులు పిర్కాన్ ఊరులోని ఉఫాస్ ఇంటిలోకి ప్రవేశించి అతనిని కత్తిపోట్లకు గురిచేశారు. షిల్లాంగ్ లోని బారా బజార్ ప్రాంతంలో శనివారం జరిగిన సంఘటన గురించి పోలీసులు ఇంకా విచారిస్తూనే ఉన్నారు. ఆ రోజు కొందరు ముసుగు వేసుకున్న దుండగులు కత్తిపోటులు చేస్తూ వెళ్లారు. ఈ దాడి కేవలం నాన్-ట్రైబల్స్ మీద జరిగింది. ఇందులో ఒకరు చనిపోతే, మరో తొమ్మిది మంది గాయపడి ఉన్నారు.

జోడూ చౌదరీ ఈ దాడులకు గురైనవాళ్లలో ఒకడు. ఇద్దరు ముసుగు వేసుకుని ఉన్న వాళ్లు తనను వెనుక నుంచి వచ్చి పొడిచారని తను చెప్పాడు. షిల్లాంగ్ కి అస్సామ్ లోని సిల్చార్ నుండి వచ్చిన ఈ 52 ఏళ్ల మనిషి ఇప్పుడు అదే షిల్లాంగ్ లోని సివిల్ హాస్పిటల్ లో మేల్ సర్జరీ వార్డ లో కోల్కుంటున్నాడు. చౌదరీని పొడిచాక, ఆ దాడిచేసినవాళ్లు తన పొరుగింటివాడైన రూప్ చంద్ దేవాన్ కోసం వెళ్లారు. 29 ఏళ్ల దేవాన్, అస్సామ్ లోని బర్పేటా కు చెందినవాడు. ఇతని మీద దాడి మరింత దారుణంగా జరగడం వల్ల, దేవాన్ బ్రతకలేకపోయాడు. తన ఇంటి యజమానురాలైన పర్వీన్, సంఘటనను వివరిస్తూ కుప్పకూలిపోయింది. దేవాన్ మరియు తన భార్య బర్పేటా లో కేవలం రెండు వారాల ముందు ఒక పాపని దత్తతు తీసుకున్నారు.

ఆకాష్ అలీ అనే 27 ఏళ్ల యువకుడు ఒక కొరియర్ సర్వీస్ కి పనిచేసేవాడు. అతను లన్స్నింగ్ కు వెళ్లినప్పుడు, అతని మీద తెలియని దురాక్రమణదారులు దారుణంగా దాడి చేశారు. అతని టెంపోని ధ్వంసం చేసి, అతని తలని సుత్తితో కొట్టాడని ఆకాష్ వాళ్ల అన్న వివరించాడు. మేల్ సర్జరీ వార్డ్ లో అడ్మిట్ అయి ఉన్నప్పుడు, ఆకాష్ మాట్లాడలేకపోయాడు.

అదే వార్డ్ లో మరో బెడ్ మీద ఉన్న సాయిఫుల్ అలీ తన అడ్రెస్ చెప్పడం కోసం పోరాడుతున్నాడు. తను తీవ్రంగా గాయపడి ఉన్నాడు మరియు ఒక కన్నును తెరవలేకపోతున్నాడు. తను ఒక మెకానిక్ అని, భోలాగంజ్ లో పని చేస్తానని తను వివరించాడు.

కే.ఎస్.యు కు అసిస్టెంట్ జెనరల్ సెక్రెటరీ అయిన నోన్గ్రుమ్, ఈ హింస జరుగుతూ ఉన్నా కూడా తను ఆశ్చర్యపోడని, ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని, తన భావన వ్యక్తం చేశాడు. 2013 లో ఇలాగే ఇన్నర్ లైన్ పర్మిట్ కోసం దాడులు జరిగినప్పుడు నోన్గ్రుమ్ ని మర్డర్ కింద అరెస్ట్ చేశారు. తనను అప్పుడు తాను ఏ తప్పూ చేయకుండానే అరెస్ట చేశారని నోన్గ్రుమ్ చెప్పాడు.

నోన్గ్రుమ్ నాన్-ట్రైబల్స్ గొడవలు మొదలుపెట్టారని చెప్పాడు. వాళ్లు చాలా మీటింగ్స్ నిర్వహించారని, వాళ్లకి ఇన్నర్ లైన్ పర్మిట్ రెజీమ్ కావాలని తను తెలిపారు. కానీ నాన్-ట్రైబల్స్ కి సీ.ఏ.ఏ ఇష్టం ఉండడం వల్ల వాళ్లు గొడవలు ప్రారంభించారని చెప్పాడు. వాళ్లు మీటింగ్ నుండి వెళ్లిపోతున్నప్పుడు నాన్-ట్రైబల్స్ వాళ్ల మీద దాడి చేశారని చెప్పాడు.

కానీ, పోలీసుల ప్రకారం, ఇది వేరేగా జరిగింది. వాళ్ల ప్రకారం, కే.ఎస్.యూ సభ్యులు ఒక గడ్డి మోపుని కాల్చి, ఒక ఇల్లుని కాల్చే ప్రయత్నం చేయడం వల్లనే నాన్-ట్రైబల్స్ ప్రతీకారం కోసం గొడవలు చేశారు. ఇది ఇలా ఉండగా, అమాయకమైన నాన్-ట్రైబల్స్ మరియు ట్రైబల్స్ ఒకే రకంగా భయపడుతున్నారు.

Facebook Comments