భారత్‌ లో ఐఫోన్లు మరింత ప్రియం!

48

భారత దేశంలో కొన్ని ఆపిల్ ఫోన్‌ల రేట్లు పెరిగిపోయాయి. దీనికి రెండు కారణాలు ఉన్నాయి.

  1. దిగుమతి అయిన మొబైల్ ఫోన్స మరియు ఛార్జర్స్ మీద కస్టమ్స్ డ్యూటీ పెంపు.
  2. ఈ సంవత్సరం యూనియన్ బడ్జెట్‌లో సాంఘిక సంక్షేమ సర్‌ఛార్జ్ లో పెంపు.

ఈ ధరల పెరుగుదల కేవలం ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ మరియు ఐఫోన్ 8 లాంటి మోడల్స్ ధరలను ప్రభావితం చేస్తుంది. ఈ పెరిగిన ధరలు ఈ సంవత్సరం 2 మార్చి  నుండి వాటి ప్రభావం చూపుతాయి. కానీ, ఐఫోన్ ఎక్స్ఆర్ మరియు ఐఫోన్ 7 ల మీద ఈ ధరల పెంపు ఉండదు. ఎందుకంటే, ఈ మోడెల్స్ భారత దేశం లోనే ఫాక్స్-కాన్ మరియు విస్ట్రాన్‌ల ద్వారా సమీకరించబడుతున్నాయి. వీటిని మాత్రమే కాకుండా, కంపెనీ ఐఫోన్ 11, ఐపాడ్, ఆపిల్ వాచ్ మరియు మాక్ డెస్క్‌టాప్‌లపై కూడా ధరల పెంపును మినహాయించింది.

పరిశ్రమ వర్గాలు చెప్తున్నది ఏమిటంటే, కరోనా వైరస్ వల్ల కొన్ని చైనీస్ బ్రాండ్‌ల ఉత్పత్తి మరియు సరఫరా ఆగిపోయి ఉన్నా, దానికీ ఆపిల్‌కీ సంబంధం లేదని. ఆపిల్ ధరలు పెంచినది కేవలం మొబైల్ ఫోన్స్ మరియు ఛార్జర్స్ మీద కస్టమ్స్ డ్యూటీ పెంపు వల్లనే అని కూడా చెప్తున్నాయి.

ప్రస్తుతతం ఉన్న ధరలు –

ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ 64 జీబీ – రూ.1,11,200

ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ 256 జీబీ – రూ.1,25,200

ఐఫోన్ 11 ప్రో మ్యాక్స 512 జీబీ – రూ.1,43,200

ఐఫోన్ 11 ప్రో 64 జీబీ – రూ.1,01,200

ఐఫోన్ 11 ప్రో 256 జీబీ – రూ.1,15,200

ఐఫోన్ 11 ప్రో 512 జీబీ – రూ.1,33,200

ఐఫోన్ 8+ 64 జీబీ – రూ.50,600

ఐఫోన్ 8+ 128 జీబీ – రూ.55,600

ఐఫోన్ 8 64 జీబీ – రూ. 40,500

ఐఫోన్ 8 128 జీబీ – రూ.45,500

ఇక నిజంగానే ఐఫోన్ భారత దేశంలో మరింత మరింత ‘ప్రియం’అయినదని అనుకోవాలి.

Facebook Comments