నోకియా సింహాసనం దిగిపోయిన మనోడు

58

నోకియా మరియు నోకియా సీమెన్స్ నెట్వర్క్స్ కు పది ఏళ్లకు పైన ప్రెసిడెంట్, సీ.ఈ.ఓ గా పనిచేసిన రాజీవ్ సూరి ఇప్పుడు పెక్కా లుండ్‌మార్క్ కు దారి ఇస్తూ ఆ సింహాసనాన్ని దిగిపోయాడు. నోకియా ఈ విషయం అధికారికంగా ప్రకటించింది. సూరి ఈ విషయం నోకియా డైరెక్టర్స్ బోర్డ్ కి కొద్ది రోజులు ముందే చెప్పాడని సమాచారం. దాదాపు 25 ఏళ్లు నోకియా లో పనిచేశాక తను ఏమైనా వేరే పని చేయాలనుకుంటున్నాడని సూరి చెప్పాడు. అంతేకాదు, నోకియా తన జీవితంలో ఎప్పటికీ భాగంగానే ఉంటుందనీ, తను తనతో పనిచేసినవాళ్లందరికీ తనని ఒక గొప్ప నాయకుడిగా మరియు నోకియాని ఒక గొప్ప చోటుగా చేసినందుకు వాళ్లకి తన ధన్యావాదాలు తెలుపుకున్నాడు.

పెక్కా లుండ్మార్క్ ప్రస్తుతం ఫార్టమ్ అనే ఒక ఫిన్నిష్ ఎనర్జీ కంపెనీకి సీ.ఈ.ఓ. అతను సెప్టెంబర్ 1నాటికి  నోకియా ప్రెసిడెంట్ గా తన పని మొదలుపెట్టబోతున్నాడని నోకియా చెప్పింది. బోర్డ్ చెయిర్, రిస్టో సీలాస్మా తన అభిప్రాయం వ్యక్తం చేస్తూ, పెక్కా నోకియాలో చేరడానికి ఒప్పుకున్నందుకు  గర్వపడుతున్నాడని చెప్పాడు.

ఈ భారతీయ మరియు సింగపూరియన్ జాతీయత ఉన్న సూరి మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బ్యాచిలర్స్ ఆఫ్ ఇంజినీరింగ్ చేశాడు. మైక్రోసాఫ్ట్ మొబైల్ తో నోకియా వారి ఫోన్ విభజన విక్రయం అయిపోయాక సూరి నోకియాకు సీ.ఈ.ఓ అయ్యాడు. తను స్టిఫెన్ ఇలోప్‌కు వారసుడిగా నోకియాకు సీ.ఈ.ఓ అయ్యాడు. ఇది 2014లో జరిగింది.

ఢిల్లీలో పుట్టి, కువైట్‌లో పెరిగి, సింగపూర్ పౌరుడిగా ఉన్న సూరికి ఇప్పుడు 53 ఏళ్లు. తను తన ప్రస్తుత స్థానాన్ని ఈ సంవత్సరం ఆగస్టు 31న వదిలి, 2021 జనవరి 1 వరకు నోకియాకు సలహాదారుడిగా ఉంటాడు. మొబైల్ ఫోన్ మార్కెట్‌లో నోకియా తిరిగి రావడానికి రాజీవ్ సూరి కీలక పాత్ర పోషించాడు.

Facebook Comments