ఆపిల్‌పై నత్తగుల్ల ఫోన్ల భారం ఎంతంటే…?

100

పాత మోడెల్స్ కొన్న వినియోగదారులను వేరే ఫోన్లను బదులుగా తీసుకోవడానికో, లేదా కొత్త బ్యాటరీలు కొనడానికో ప్రేరేపించడానికి ఆపిల్ పాత ఫోన్ మోడెల్స్ ని మందగించింది. ఇందుకు జరిమానాగా ఆపిల్‌ను 500ల మిలియన్ల డాలర్లు కట్టమని అడగగా, ఆపిల్ ఒప్పేసుకుంది. ప్రాథమికంగా ప్రతిపాదితమైన పరిష్కారాన్ని శుక్రవారం రాత్రి బహిర్గతం చేశారు. ఇప్పుడు దానికి యూ.ఎస్ జిల్లా న్యాయమూర్తి అయిన ఎడ్వర్డ్ డెవిలా అనుమతి అవసరం.

ఈ చర్యల ప్రకారం ఆపిల్ తన వినియోగదారులకు ఒక్కో ఐఫోన్‌కి 25 డాలర్లు జరిమానా కట్టాలి. కట్టవలసిన జరిమానా ఎన్ని ఐఫోన్స్ దానికి యోగ్యమైనవి అనే సంఖ్యతో పెరగడం లేదా తగ్గడం జరగవచ్చు. మొత్తం మీదుగా కనీస చెల్లింపులు దాదాపు 310ల మిలియన్ల డాలర్లు దాకా వెళ్తాయి.
ఆపిల్ తను చేసిన తప్పులను ఖండించి లిటిగేషన్ యొక్క భారాలు, ఖర్చులు నివారించడానికి దేశవ్యాప్తంగా కేసును పరిష్కరించుకుందని కోర్టు పేపర్లు చూపించాయి. సోమవారం రోజు ఈ కంపెనీ తన మీదకు వ్యాఖ్య కోసం వచ్చిన అభ్యర్థనలకు తక్షణమే స్పందన ఇవ్వలేదు. శుక్రవారం రోజు ఎవరైతే యూ.ఎస్. లోని ఐఫోన్ యజమానులకు పరిష్కారం చూపబడిందో, వాళ్లలో ఐఫోన్ 6, 6 ప్లస్, 6 ఎస్, 6 ఎస్ ప్లస్, 7, 7 ప్లస్ వంటి ఫోన్లు సొంతమైన వాళ్లు కూడా ఉన్నారు.

వినియోగదారులు వాళ్లు తమ ఫోన్లలో ఆపిల్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లను ఇన్‌స్టాల్ చేశాక తమ ఫోన్ల నిర్వహణ తగ్గిపోయిందని వాదించారు. అంతేకాదు, ఈ అప్‌డేట్స్ వాళ్లని తమ ఫోన్ జీవితం అయిపోవచ్చిందని, వాళ్లు త్వరలోనే కొత్త బ్యాటరీలు లేదా ఫోన్లు కొనాలని నమ్మడానికి దారి తీసాయి అని కూడా వాదించారు. కానీ, ఆపిల్ మాత్రం దీనికి ప్రతివాదనగా, ఇదంతా ఎక్కువసేపు ఉపయోగించడం వల్లనో, ఉష్ణోగ్రతలో మార్పులు వల్లనో, లేదా ఇతర సమస్యల వల్లనో జరిగింది అని చెప్పింది. తమ ఇంజినీయర్లు ఈ సమస్యను త్వరగా మరియు సఫలతాపూర్వకంగా పరిష్కరించడానికి ప్రయత్నించారు అని కూడా కంపెనీ తెలిపింది.

వినియోగదారుల తరఫున వాదించిన లాయర్లు ఈ పరిష్కారం న్యాయంగా, తగినంతగా, సమంజసంగా ఉందని చెప్పారు. వాళ్లు ఒక్కో ఐఫోన్‌కి 25 డాలర్ల జరిమానా అడిగారు. లాయర్లు మొత్తంగా దాదాపు 93 మిలియన్ల డాలర్లు కోరుకుంటున్నారు. కానీ ఇది 310 మిలియన్ల డాలర్లలో దాదాపు 30% మాత్రమే. దీనితో సహా ఒక 1.5 మిలియన్ల డాలర్లు ఖర్చుల కోసం కోరుకుంటున్నారు.

జరిగిన ఆగ్రహంతో ఆపిల్ చేసిన తప్పుకు క్షమాపణలు కోరి భర్తీ బ్యాటరీలకు ధర 79 డాలర్ల నుంచి 29 డాలర్లకు తగ్గించింది.

ఆపిల్ వార్షిక వ్యాపారం, 2018 ప్రకారం, దాదాపు 265 బిలియన్ల డాలర్లు. అంటే, దాదాపు 26,500ల కోట్లు! ఇంత వస్తున్నా కూడా ఇంకా రావాలని అత్యాశ పడితే ఇలాగే జరుగుతుందేమో మరి…!

Facebook Comments