ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ శ్రీకాళహస్తి డివిజన్ నాయకులు శ్రీకాళహస్తి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్ పర్సన్ గా నూతనంగా నియమింపబడిన అంజూరు తారక శ్రీనివాసులును దుశ్శాలువతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా UTF జిల్లా ఉపాధ్యక్షులు కె సూర్య ప్రకాష్ మాట్లాడుతూ అంజూరు శ్రీనివాసులు మంచి దూర దృష్టి కలిగిన నాయకుడు అని, అన్ని విషయాలపై అవగాహన కలిగిన నాయకుడు అని అన్నారు.
జిల్లా కార్యదర్శి జి.శ్రీనివాసులు మాట్లాడుతూ ఉపాధ్యాయ కుటుంభం నుంచి వచ్చిన ఆంజూరు శ్రీనివాసులు మరిన్ని మంచి పదవులు చేపట్టాలని కోరారు.
ఈ కార్యక్రమం UTF శ్రీకాళహస్తి డివిజన్ కన్వీనర్ శివ కుమార్ ఆధ్వర్యాన జరుగగా ఈ అభినందన కార్యక్రమానికి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ o. విజయ కుమార్, శ్రీకాళహస్తి రూరల్, పట్టణ అధ్యక్షులు మోహన్ బాబు, గోపి, పట్టణ ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ రెడ్డి, జిల్లా సాంస్కతిక కమిటీ సభ్యులు సుబ్రమణ్యం, వరదయ్యాపాలెం ఉపాధ్యక్షులు సుబ్రమణ్యం, డివిజన్ సి పి ఎస్ కన్వీనర్ హరి బాబూ, వెంకట కృష్ణ, రాష్ట్ర మాజీ మహిళా కార్యవర్గ సభ్యులు శ్రీమతి జ్ఞాన ప్రసూన,వెంకటేశ్వర్లు, మ, మొదలైన మండల లీడర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అంజూరూ శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ చైర్మన్ పదవి ఒక అదృష్టం గా భావిస్తున్నానని, నేను ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటానని తెలియజేశారు
తదుపరి UTF సీనియర్ నాయకులు పసల రమణయ్య సతీమణి పసల సుమతి ను పుష్పగుచ్ఛం తో అభినందించారు.
.