‘బిజెపి అంటే సిద్ధాంతాల పార్టీ’ అని అంటూ ఉంటారు. అయితే అదంతా ఒకప్పటి మాట మాత్రమేనా? వర్తమానంలో సిద్ధాంతాలను తుంగలో తొక్కేశారా? ఏ అడ్డదారి తొక్కినా పర్లేదు గానీ.. అధికారంలోకి వచ్చేస్తే చాలు.. అనేదే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ చెలరేగిపోతోందా? ఈ జాతీయ పార్టీ దేశవ్యాప్తంగా ఇలాగే ఉన్నదో లేదో తెలియదు గానీ.. తెలంగాణ వ్యవహారాలను గమనించినప్పుడు మాత్రం అదే నిజం అనిపిస్తుంది.
తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఒక నిర్దిష్టమైన ఆదరణ ఉంది. దానికి తగ్గట్టుగా ఆ పార్టీకి తొలినుంచి ఎన్నో కొన్ని సీట్లు దక్కుతూనే ఉన్నాయి. పార్టీ నాయకులు ప్రజలతో మమేకమై పనిచేస్తూ వచ్చారు. బండిసంజయ్ పార్టీ సారధి అయిన తర్వాత.. దూకుడు బాగా పెరిగింది. కేసీఆర్ మీద రాజకీయ విమర్శలు చేయడం, ఆ రకంగా దూకుడు ప్రదర్శించడం అంతా ఒక ఎత్తు. అది కేవలం రాజకీయ ఎత్తుగడ అనిపించుకుంటుంది. కానీ.. పార్టీ బలం పెంచుతున్నాం అనే ముసుగులో విలువలను, పార్టీకి యూఎస్‌పి వంటి సిద్ధాంతాలను తుంగలో తొక్కేస్తే ఎలా ఉంటుంది?
తెలంగాణ లో బీజేపి తమ సిద్ధాంతాలను పక్కన పెట్టిందా, అధికారకమే లక్ష్యంగా పని చేస్తోందా? అనడానికి నాడు ఈటెల, నేడు మల్లన్న చేరికలే అతిపెద్ద ఉదాహరణలు అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పార్టీలో చేర్చుకోవడం పై కార్యకర్తల నుండి, సీనియర్ల నుండి విమర్శలు వస్తూనే ఉన్నాయి. అయినా కానీ తెలంగాణలో ప్రస్తుత నాయకత్వం తమదైన శైలిలో దూసుకుపోతూనే ఉంది.
దశాబ్దాలుగా పార్టీలోనే ఉన్న సీనియర్ నాయకులకు వర్తమానంలో పార్టీ పరిణామాలు ఒక పట్టాన మింగుడు పడడం లేదు. సిద్ధాంతాలు మంచివి అనే నమ్మకంతో భాజపాలో ఉంటూ వచ్చిన వారు.. ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత.. అధికారం కోసం పార్టీ పంచన చేరుతున్న కొత్త తరం నాయకుల పోకడలను జీర్ణించుకోలేకపోతున్నారు.
అయినా సరే.. తెలంగాణలో బీజేపీ తనదైన దూకుడునే ప్రదర్శిస్తోంది. సొంత నాయకులనుంచే ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ.. తన తరహాలో దూసుకుపోతున్నారు. విలువల సంగతి తర్వాత.. ముందు అధికారంలోకి వచ్చేలాగా బలం పెంచుకోవడం మాత్రమే టార్గెట్ అన్నట్టుగా వారి తీరు ఉంటోంది.
ఈటల, తీన్మార్ మల్లన్న వ్యవహారాలే ఇందుకు ప్రబల తార్కాణాలు అని అందరూ అంటున్నారు. ఈటల రాజేందర్ ను తెరాస వెలివేసిన తర్వాత.. గత్యంతరం లేదు గనుక మాత్రమే బీజేపీ పంచకు వచ్చారు. అదే తరహాలో తీన్మార్ మల్లన్న కూడా ప్రభుత్వం కార్నర్ చేసిన తర్వాత.. కేసుల బారినుంచి తప్పించుకోడానికి, రాజకీయ కవచంగా వాడుకోవడానికి బీజేపీని ఆశ్రయిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
satire : అర్ధరాత్రి గునపం దరువులు
కేబినెట్ ప్రక్షాళన ఒక సమరం : జగన్ vs ముగ్గురు బలమైన మంత్రులు
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్‌పిసి 41 (ఎ)
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
గ్యాంగ్ స్టర్ నయీమ్ అనుచరుడే వంద కోట్లు సంపాదించాడంటే…?
అంతేతప్ప వారిద్దరూ కూడా ఏ రకంగానూ, ఏనాడూ బీజేపీ భావజాలంతో మమేకమైన వారు కానే కాదని, ఇలాంటి వారు పెరుగుతూ పోతే.. పార్టీకి భవిష్య పరిణామాలు చేటు చేస్తాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Discussion about this post