చిత్తూరు జిల్లాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రికార్డు స్థాయిలో ఒకే రోజు 2,338 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.
ఇంత పెద్ద మొత్తంలో పాజిటివ్ కేసులు రావడం ఇదే ప్రథమమని వైద్యశాఖ వర్గాలు అంటున్నాయి. కరోనాకు తోడుగా వైరల్ జ్వరాలు విజృంభిస్తుండటంతో జనం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు.
ఏ క్షణానికి ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. గత అనుభవాలను నెమరు వేసుకుని భయపడుతున్నారు.
చిత్తూరు జిల్లాలో బుధవారం ఉదయం 9 నుంచి గురువారం ఉదయం 9గంటల వరకు 24గంటల వ్యవధిలో 2,338 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఇందులో నగర, పట్టణాల పరిధిలో 1,036 కేసులు నమోదయ్యాయి.
తిరుపతి నరగ పాలక పరిధిలో 573, చిత్తూరులో 220, మదనపల్లెలో 85, పుంగనూరులో 43, శ్రీకాళహస్తిలో 43, పుత్తూరులో 32, నగరిలో 24, పలమనేరులో 16 వంతున కేసులు నమోదయ్యాయి.
ఇక గ్రామీణ పరిధిలో 1,302 కొత్త కేసులు ఉన్నట్లు గుర్తించారు. జిల్లాలోని 66 మండలాల్లో పాజిటివ్ కేసులు రావడం విశేషం.
మండలాల వారీగా పరిశీలిస్తే… తిరుపతి రూరల్ లో 160, కుప్పం 90, ఐరాల 79, బంగారుపాళెం 62, పీలేరు 61, చంద్రగిరి 37, సదుం 36, మదనపల్లె 34, పూతలపట్టు 29, వెంకటగిరికోట 29, వాల్మీకిపురం 27, గుడుపల్లె 26, రామకుప్పం 26, గంగాధరనెల్లూరు 25, తవణంపల్లె 24, బి.కొత్తకోట 22, పాకాల 22, ములకలచెరువు 20, గంగవరం 19, కార్వేటినగరం 19, పులిచెర్ల 19, తంబళ్లపల్లె 19, గుర్రంకొండ 17, కలికిరి 16, రేణిగుంట 16, శాంతిపురం 16, సత్యవేడు 15, యర్రావారిపాళెం 15, చౌడేపల్లె 14, నారాయణవనం 14, పుత్తూరు 14, పెద్దపంజాణి 13, రొంపిచెర్ల 13, కురబలకోట 12, యాదమరి 12, గుడిపాల 11, నాగలాపురం 11, తొట్టంబేడు 11, వరదయ్యపాళెం 11, చిన్నగొట్టిగల్లు 10, చిత్తూరు 10, కేవీబీపురం 10, రామచంద్రాపురం 10, వెదురుకుప్పం 10, బైరెడ్డిపల్లె 9, కలకడ 9, కంభంవారిపల్లె 9, పలమనేరు 9, పుంగనూరు 9,
విజయపురం 9, నిమ్మనపల్లె 8, రామసముద్రం 8, బుచ్చినాయుడుకండ్రిగ 7, పెద్దతిప్పసముద్రం 7, పెనుమూరు 7, వడమాలపేట 7, నిండ్ర 6, పెద్దమండ్యం 6, శ్రీకాళహస్తి 6, పాలసముద్రం 5, సోమల 5, శ్రీరంగరాజపురం 4, ఏర్పేడు 3, నగరి 2, పిచ్చాటూరు 1 వంతున కొవిడ్ కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం జిల్లాలో 9,888 యాక్టివ్ కేసులు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో ఇప్పటి వరుకు 2,61,800 మంది కరోనా బారిన పడగా… ఇందులో 1,963 మంది మృతి చెందారు.
రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల వ్యవధిలో నమోదైన కరోనా కేసులు పరిశీలిస్తే… అనంతపురం 951, చిత్తూరు 2,338, తూర్పుగోదావరి 627, గుంటూరు 1,066, వైఎస్ ఆర్ కడప 685, కృష్ణా 363, కర్నూలు 884, నెల్లూరు 1,012, ప్రకాశం 853, శ్రీకాకుళం 464, విశాఖ పట్నం 2,117, విజయనగరం 1,039, పశ్చిమగోదావరి 216 వంతున మొత్తం 12,615 కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 21,40,056 మంది కొవిడ్ బారిన పడ్డారు. ఇందులో 14,527 మంది ఈ వైరస్ తో చని పోయారు. ప్రస్తుతం 53,871 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Discussion about this post