శ్రీ కాళహస్తి పట్టణంలోని తెలుగు గంగాకాలనీ నందు గల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఫిబ్రవరి 24వ తేదీన సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవాన్ని కామర్స్ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.నారాయణ రెడ్డి మాట్లాడుతూ వ్యాపార రంగంలో అవినీతిని నివారించడానికి మరియు ఇతర కార్యకలాపాలు సమర్థ వంతంగా నిర్వహించడానికి సెంట్రల్ ఎక్సైజ్ విభాగం వారు విశేష కృషి చేసి దేశ అభివృద్ధికి తోడ్పడుతున్నారని అన్నారు .
కామర్స్ విభాగాధిపతి అయినా రాగి సాహితి సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవాన్ని జరుపుకునేందుకు గల ప్రాముఖ్యతను వివరించారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ దీన్దయాల్ ఐక్యూ ఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ మహేశ్వరి, వ్యాయామం అధ్యాపకులు నరసింహ, గ్రంథాలయ అధ్యాపకులు శ్రీకాంత్ రెడ్డి, ఇతర అధ్యాపక బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు
.