తుఫాన్ బాధితుల నుంచే వచ్చే ఫిర్యాదులను సంబంధిత అధికారులకు తెలియజేసి పరిష్కరించేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) సి.హెచ్ .శ్రీధర్ అన్నారు.
శుక్రవారం స్థానిక సచివాలయంలో తుఫాను బాధితుల కోసం ఏర్పాటు చేసిన సైక్లోన్ కమాండ్ కంట్రోల్ రూమ్ మరియు 104 కాల్ సెంటర్ నందు విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తుఫాన్ తీవ్రత దృష్ట్యా నష్టపోయిన తుఫాను బాధితుల సమస్యలను పరిష్కరించడానికి స్థానిక సచివాలయంలో సైక్లోన్ కమాండ్ కంట్రోల్ రూమ్ మరియు 104 కాల్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
ప్రతి ఒక్కరూ శాఖల వారీగా విధులు నిర్వహించాలని మరియు ఎప్పటికప్పుడు కాల్ సెంటర్ కు వచ్చే ఫిర్యాదులను స్వీకరించి సంబంధిత అధికారులకు తెలియజేయాలన్నారు.
విధులు నిర్వహిస్తున్న సిబ్బంది కి ఎన్డీఆర్ఎఫ్ , సంబంధిత శాఖల అధికారుల ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉంచుకోవాలనీ సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు.
.