తమిళనాడులోని కున్నూరు సమీపంలో హెలికాప్టర్ వెళుతూ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన దేశ రక్షణ రంగ చీఫ్ బిపిన్ రావత్ ఆయన సతీమణి మధులికతో పాటు ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు ఏఐటీయూసీ ప్రజా సంఘాల కార్యకర్తలు శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ రక్షణ రంగంలో కీలక పాత్ర పోషిస్తూ ప్రపంచ దేశాలను శాసిస్తూ భారత్ యొక్క కీర్తిని ఇనుమడింప చేస్తూ దేశానికి రక్షణ కవచం గా ఉన్నటువంటి బిపిన్ రావత్ మరణం భారతదేశానికి తీరని లోటు అన్నారు.
1978లో చేరిన బిపిన్ రావత్ అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక పదవులు చేపట్టి దేశ రక్షణ రంగం కోసం ఆయన సేవలు మరువలేనిది, ఈ సందర్భంగా అనేక పథకాలను ఆయన సొంతం చేసుకోవడం ఆయన ప్రతిభకు గీటురాయి అన్నారు.
మొత్తం 13 మంది హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకోవడం భారతదేశానికి రక్షణ రంగంలో ఆయన లేని లోటు తీవ్రమైనవి, ఈరోజు రక్షణ నేవీ ఎయిర్ ఫోర్స్ త్రివిధ దళాలకు పూర్తి బాధ్యత తీసుకొని ముందుండి నడిపించుట కలిగిన సత్తా కలిగిన అధికారిగా మన్ననలు పొందాడన్నారు.
ఈరోజు పాకిస్థాన్తో , చైనాతో జరిగిన యుద్ధాల్లో దేశ ప్రతిష్ట, కీర్తిని ప్రపంచదేశాలకు చాటిచెప్పిన వ్యక్తి రావత్ గారు , శీను తో పాటు కలిసి పనిచేస్తున్న చిత్తూరు జిల్లాకు సంబంధించిన సాయి కృష్ణ కూడా ప్రాణాలు కోల్పోవడం బాధాకరం, వారందరూ కుటుంబాలకు భగవంతుడు తోడు ఉండాలని, ఆత్మ శాంతించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ తో నివాళులు అర్పించారు, ఏఐటీయూసీ నాయకులు, కోదండ య్య వే లన్, భాష, రూపు కుమార్, మురళి శేఖర్ బాబు నాగరాజ పాల్గొన్నారు.
.