కాంగ్రెస్ పార్టీనే దేశానికి రక్ష అని ఆ పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ అధ్యక్షులు డాక్టర్ బత్తెయ్యనాయుడు అన్నారు. కాంగ్రెస్ పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళవారం శ్రీకాళహస్తిలో ఘనంగా నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించి వందనం చేశారు. ఈ సందర్భంగా బత్తెయ్యనాయుడు మాట్లాడుతూ…1885 డిసెంబరు 28న అల్లాన్ ఓక్టావియన్ హ్యూమ్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారన్నారు.
అప్పట్లో ఈ పార్టీ 11మంది కమిటీ సభ్యులు ఉన్నారని చెప్పారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ భారత స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిన సంగతి అందరికీ తెలిసిందేనని ఈ సందర్భంగా బత్తెయ్యనాయుడు గుర్తు చేశారు.
మహాత్మా గాంధీ 1920లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించి 1947లో భారతదేశానికి స్వాతంత్రాన్ని సాధించిపెట్టారన్నారు. నాటి నుంచి కాంగ్రెస్ కు ఎంతో మంది నాయకత్వం వహించారన్నారు.
ఎంతో ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు మరువ కూడదన్నారు. కాంగ్రెస్ హయాంలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని బత్తెయ్యనాయుడు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
పేదల కోసం నిరంతరం పని చేసే కాంగ్రెస్ కు అండగా ప్రజలు నిలబడాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో బి.వి. శేఖర్, వెంకటముని, శివయ్య, సురేష్, మోహన, నాగూరయ్య తదితరులు పాల్గొన్నారు.
.