సీఆర్ డీఏ చట్టం అమరావతికి శ్రీరామరక్ష అని తెలుగుదేశం పార్టీ నేతలు అన్నారు. అమరాతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని… ఏ ఒక్క కార్యాలయం ఇతర ప్రాంతాలకు తరలించడానికి వీలులేదని.. రైతులకు మూడు నెలల్లోగా ఫ్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాలని.. అమరావతిలో నిర్మాణాలు ఆరు నెలల్లోపు పూర్తి చేయాలని ఆదేశిస్తూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం గురువారం తీర్పు ఇచ్చిన నేపథ్యంలో శ్రీకాళహస్తిలో తెలుగుదేశం పార్టీ నేతలు శుక్రవారం సంబరాలు చేసుకున్నారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మునిరాజా యాదవ్ ఆధ్వర్యంలో ఈ సంబరాలు జరిగాయి.
ఇందులో భాగంగా నందమూరి తారక రామారావు విగ్రహానికి పాలాభిషేకం చేశారు. హైకోర్టు తీర్పు అనుకూలంగా రావడం అమరావతి రైతుల విజయంగా వారు అభివర్ణించారు. అమరావతి రైతులకు ఉద్యమాభివందనాలు తెలియచేశారు. అనంతరం పట్టణంలోని కొత్తపేటలో గల సీతాలాంబఅమ్మవారి గుడి వద్ద 101 టెకాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దశరథ ఆచారి, రెడ్డివారి గురవారెడ్డి, పార్లమెంట్ నాయకులు చెంచయ్య నాయుడు, మాజీ వైస్ చైర్మన్ మిన్నల్ రవి, పార్లమెంట్ మైనారిటీ ప్రధాన కార్యదర్శి జిలానీ బాషా, తొట్టంబేడు మండల అధ్యక్షులు గాలి మురళీ నాయుడు, మాజీ ట్రస్ట్ బోర్డు సభ్యులు గురప్ప శెట్టి, రేణుక దేవి, మాజీ టౌన్ బ్యాంకు చైర్మన్ నారాయణ, దొరైరాజ్ రెడ్డి, పోలూరు శ్రీనివాసులు రెడ్డి, ఎం ఎస్ రెడ్డి, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కృష్ణవేణి,
ఏర్పేడు మహిళలు అధ్యక్షురాలు హంస, పట్టణ మహిళా అధ్యక్షురాలు సుమతి, ప్రధాన కార్యదర్శి దుర్గ, శ్రీలక్ష్మి, కాళప రెడ్డి, రామచంద్రయ్య ,గుత్తా విజయ్, సుందరం, వెంకటేష్ చౌదరి, ఊహ, శ్రీహరి నాయుడు, సుబ్రహ్మణ్యం, వెంకటేశ్వర్లు, గోపినాథ్, తెలుగుయువత అధ్యక్షులు కిట్టు , వినయ్, సుజిత్, సాయి నాయుడు, బాలాజీ, ప్రవీణ్ చౌదరి, షఫీ, అస్మత్, రజినీకాంత్, ఆర్ముగం, మణి, సన్నీ, సుబ్రహ్మణ్యం, కుమారి, కృష్ణమ నాయుడు, భాస్కర్, హేమంత్, మణి, యాదగిరి, నాగేశ్వరావు, శ్రీహరి, సుజాత, గంగిరెడ్డి, సుబ్రహ్మణ్యం నాయుడు, ధనంజయ నాయుడు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
.