– టికన్సల్ట్ కృషి ప్రశంసించిన మంత్రి శ్రీధర్ బాబు
– పెట్టుబడుల అవకాశాల వెలికితీతలో టికన్సల్ట్ కీలక పాత్ర
– పాలసీ మేకర్స్, ఆవిష్కర్తలు, పరిశ్రమ నేతలను ఒకే వేదికపైకి తేవడం ఈ కార్యక్రమ విశిష్టత
టికన్సల్ట్ కొలాబొరేషన్ కాంక్లేవ్ 2024 ని తెలంగాణ ఐటీ శాఖ మత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంబించారు. ఐటీ మరియు పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు దుద్దిళ్ల ప్రారంభించిన ఈ రెండు రోజుల సమావేశంలో, వివిధ రంగాల్లో ఆవిష్కరణలు, అభివృద్ధికి నూతన మార్గాలు చూపించే 117 ఒప్పందాలు కుదిరాయి. ఈ కార్యక్రమం హైదరాబాద్, టి-హబ్ వేదికగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి శ్రీధర్ బాబు దుద్దిల్ల, టికన్సల్ట్ మరియు ఆ సంస్థ వ్యవస్థాపకుడు సుందీప్ కుమార్ మక్తాలా చేసిన కృషిని ప్రశంసించారు. “ఆవిష్కర్తలతో పెట్టుబడిదారులను కలిపే క్రమంలో టికన్సల్ట్ కీలక పాత్ర పోషిస్తోంది.
117 ఒప్పందాల కుదిరిన వైనం ఆర్థిక అభివృద్ధికి కీలకమైన అడుగు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆవిష్కరణల్లో, పారిశ్రామిక అభివృద్ధిలో ముందుండే స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నాలలో ఇది ప్రధానమైన భాగం అవుతుంది,” అని ఆయన అన్నారు.
ఈ సమావేశంలో అన్వేషించని పెట్టుబడి కార్యక్రమం (Untapped Investor Program), టికన్సల్ట్ హెల్త్ డాక్టర్స్ పూల్, టాలెంట్ కనెక్ట్ వంటి కీలక కార్యక్రమాలు ప్రాధాన్యత పొందాయి. సుందీప్ మక్తాలా మాట్లాడుతూ, “117 ఒప్పందాలు కుదరడం అనేది సహకారం ద్వారా ఎన్ని గొప్ప అవకాశాలు వచ్చేవని నిరూపిస్తోంది. పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు, పాలసీ మేకర్లను కలిపి భవిష్యత్తును తీర్చిదిద్దే భాగస్వామ్యాలను సృష్టించడమే మా లక్ష్యం,” అని అన్నారు.ఈ సందర్భంగా బిఐసిసిఐ వ్యవస్థాపక అవార్డులు కూడా అందజేయబడ్డాయి. ప్రభుత్వ మరియు పరిశ్రమ నాయుకులతో చర్చలు, నెట్‌వర్కింగ్ డిన్నర్ వంటి కార్యక్రమాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి.రెండవ రోజు మరింత ముఖ్యమైన చర్చలు మరియు కార్యక్రమాలతో టీకన్సల్ట్ ఆవిష్కరణలకు దారి చూపిస్తుందని ఆశాజనకంగా ఉంది.
Discussion about this post