తులసివనంలో గంజాయిమొక్క అని పెద్దలు ఊరికే అనలేదు. తులసి వనం సంగతేమో గానీ.. పచ్చని పంట చేలల్లో మాత్రం ఎంచక్కా గంజాయి పెంచేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం రావడంతో పోలీసులు దాడులు చేసి అలాంటి వారి భరతం పట్టారు. ఇదంతా ఎక్కడ జరిగిందా అనుకుంటున్నారా? తెలంగాణలోని ఒక మారుమూల కుగ్రామంలో..!
ఉభయ తెలుగురాష్ట్రాల్లోనూ పుష్కలంగా గంజాయి దొరుకుతుంది. అయితే గంజాయి సాగు చేసేవారు మాత్రం.. పోలీసుల కళ్లలో మాత్రమే కాకుండా, ప్రజలెవ్వరి కళ్లలోనూ పడకుండా.. అత్యంత రహస్యంగా సాగు చేస్తుంటారు. హైదరాబాదులో అయితే ఓ అపార్ట్ మెంట్ అద్దెకు తీసుకునే ఇంట్లోనే గంజాయి మొక్కలు సాగు చేసిన వారు కూడా మన పోలీసులకు దొరికారు గానీ.. సాధారణంగా.. అడవులు చిక్కగా ఉండే ప్రాంతాల్లోనే గంజాయి సాగు జరుగుతంది. పోలీసుల చేిక్కకుండా సాగు నడిపిస్తారు.
అయితే తెలంగాణలోని కుమురం భీం జిల్లాలో కాగజ్ నగర్ మండల పరిధిలో మాత్రం.. దాపరికం, రహస్యం అవసరం లేదని అనుకున్నారో ఏమో తెలియదు గానీ.. పచ్చటి పంట చేలల్లోనే గంజాయి మొక్కలను కూడా పెంచడం ప్రారంభించారు. ఈ మండలంలోని చిన్నమాలిని గ్రామంలో ఈ వ్యవహారం వెలుగు చూసంది. మొక్కలు కాస్త పెరిగిన తర్వాత.. పోలీసులకు సమచారం అందింది. ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహిస్తే ఒక పంట చేలో.. మిగిలిన పంట మధ్యలోనే 138 గంజాయి మొక్కలు పెంచుతుండడాన్ని గమనించారు. విస్తుపోయిన అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని.. ముగ్గురిమీద కేసు నమోదు చేశారు. పొలాల్లోనే గంజాయి పెంచుతుండడం పట్ల జనం మాత్రం ఔరా అని విస్తుపోతున్నారు.
.