శ్రీ వేంకటేశ్వర ఉద్యోగుల శిక్షణ సంస్థ(శ్వేత)కు ఐఎస్‌వో 9001-2015 సర్టిఫికెట్ లభించింది. టిటిడి పరిపాలన భవనంలోని జెఈవో కార్యాలయంలో జెఈవో శ్రీమతి సదా భార్గవి చేతులమీదుగా శ్వేత సంచాలకులు శ్రీమతి ప్రశాంతికి ఈ సర్టిఫికెట్ అందజేశారు.
శ్వేతలో శిక్షణ తరగతులు, సమర్థవంతంగా రికార్డుల నిర్వహణ, ఉత్తమ ప్రమాణాలు పాటించడం అంశాలకు సంబంధించి ఈ సర్టిఫికెట్‌ను అందజేశారు. ఈ సందర్భంగా శ్వేత సంచాలకులు శ్రీమతి ప్రశాంతిని జెఈవో అభినందించారు.
డిఇవో శ్రీ గోవిందరాజన్, ఐఎస్‌వో ప్రతినిధి శ్రీ శివయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. .
.