తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల బుక్‌లెట్‌ను టిటిడి జెఈవో వీరబ్రహ్మం ఆవిష్కరించారు. టిటిడి పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో సోమవారం ఉదయం ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ మార్చి 30 నుండి ఏప్రిల్ 7వ తేదీ వరకు శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయని తెలిపారు. ఇందులో భాగంగా మార్చి 29వ తేదీన అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు.
ఏప్రిల్ 2న ఉగాది ఆస్థానం, ఏప్రిల్ 10 నుండి 12వ తేదీ వరకు శ్రీరామనవమి ఉత్సవాలు, ఏప్రిల్ 14 నుండి 16వ తేదీ వరకు తెప్పోత్సవాలు నిర్వహించనున్నట్లు జెఈవో తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో పార్వతి పాల్గొన్నారు.
.