కొత్త సంవత్సరం తొలిరోజున సూచీలు పరుగులు తీశాయి. ఆకాశమే హద్దు అన్నట్లుగా చెలరేగాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల పూలు పూయించాయి. కేవలం ఫార్మా, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్లు పడకేయగా… మిగతా అన్ని షేర్లు లాభాలు పంచాయి. ముఖ్యంగా ఆటోమొబైల్, బ్యాంకింగ్ రంగ షేర్లు దూసుకెళ్లాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు కూడా పరుగులు తీశాయి.
మళ్ళీ మార్కెట్లో విదేశీ మదుపర్ల సందడి మొదలైనట్లుగా కనిపిస్తోంది. సోమవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన తరువాత సూచీలు నిలకడగానే కొనసాగుతూ వచ్చాయి. అయితే అధిక శాతం షేర్లు ఒక స్థాయి దాటాక పెద్దగా మార్పులు లేకుండా దాదాపు అదే స్థాయిల వద్ద కదలాడుతూ వచ్చాయి. ఐసీఐసీఐ బ్యాంకు, ఇండస్ ఇండ్ బ్యాంకు, hdfc బ్యాంకు, axis బ్యాంకు, sbi, kotak బ్యాంకు లు మంచి లాభాల్లో సాగాయి.
ఇక ఆటోమొబైల్ రంగంలోని ఐషర్ మోటార్స్, మారుతీ, అశోక్ లేలాండ్ , టాటా మోటార్స్ షేర్లు గణనీయంగా పెరిగాయి. ఫైనాన్సియల్ రంగంలో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ముత్తూట్ ఫైనాన్స్, షేర్ల ధరలు బాగా పెరగ్గా , steel రంగంలోని టాటా స్టీల్, వేదాంత, jsw స్టీల్, కోల్ ఇండియా తమ సత్తా చాటాయి.
సెన్సెక్స్ 929 పాయింట్లు పెరిగి 59183 పాయింట్ల వద్ద స్థిరపడగా, nifty 271 పాయింట్ల లాభంతో 17625 పాయింట్ల వద్ద ముగిసింది.
బీఎస్ఈ లో సోమవారం 3698 షేర్లు ట్రేడ్ అవ్వగా.. 2688 షేర్లు పెరిగాయి. 876 షేర్లు క్షీణించాయి. 134 షేర్ల ధరల్లో ఎలాంటి మార్పూ లేదు మొత్తం 541 షేర్లు 52 వారాల గరిష్ట స్థాయిని చేరగా … 12 షేర్లు 52 వారాల కనిష్ట స్థాయిలో ముగిశాయి. 976 షేర్లు అప్పర్ సర్క్యూట్ ని టచ్ చేస్తే… 147 షేర్లు లోయర్ సర్క్యూట్ ని తాకాయి . బీఎస్ఈ లో మొత్తం 4,౭౩౦ కోట్ల రూపాయల టర్నోవర్ జరిగింది.
ప్రధానంగా లాభపడ్డ షేర్లు: కోల్ ఇండియా, ఐషర్ మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఐసీఐసీఐ బ్యాంకులు.
అధిక శాతం నష్టపోయిన షేర్లు: సిప్లా, డాక్టర్ రెడ్డీస్, మహీంద్రా అండ్ మహీంద్రా, దివీస్, టెక్ మహీంద్రాలు.
.. బెహరా శ్రీనివాసరావు
బిజినెస్ జర్నలిస్ట్

.