20వ.శతాబ్ధపు గణిత శాస్త్రజ్ఞు లలో శ్రీనివాస రామానుజన్ కృషి ఎనలేనిదని, చిన్న వయసులోనే గణితం పై ఆసక్తిని పెంచుకుని గణిత మేధావిగా కీర్తిపొందారని ప్రధానోపాధ్యాయులు రమణయ్య కొనియాడారు.
బుధవారం బుచ్చినాయుడు కండ్రిగ మండలంలోని కల్లివెట్టు ఉన్నత పాఠశాలలో గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పుష్పాలంకరణ చేసి నివాళి అర్పించారు
నిత్య జీవితంలో గణితం ప్రతి ఒక్కరికి అవసరమని, గణితం ఇష్టంగా నేర్చుకుంటే సులభంగా చేయడానికి వీలుంటుందని తెలుపుతూ.. శ్రీనివాస రామానుజన్ గణితంపై చేసిన పరిశోధనలను,సేవలను విద్యార్థులకు తెలిపారు.
అనంతరం గణిత ఉపాధ్యాయులు సురేష్ బాబు, దేవేంద్ర లు విద్యార్థులకు రామానుజన్ జీవిత చరిత్రపై వ్యాసరచన పోటీలతో పాటు గణితంలోని మెలకువలపై క్విజ్ పోటీలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు యువశ్రీ మురళి, ఒబ్బు ప్రసాద్, వేణుగోపాల్, మోహన్ బాబు, జయసుధ, వాణి, రామక్క తదితరులు పాల్గొన్నారు.
Discussion about this post