శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డి అభివృద్ధికి చిరునామా అని వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి అంజూరు శ్రీనివాసులు అన్నారు.
శ్రీకాళహస్తి పట్టణం లో 12, 15 వార్డులలో గాంధీ విగ్రహం నుంచి వినాయక గుడి వద్ద వరకు నూతన సిమెంట్ రోడ్డు నిర్మాణాలు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆదేశాలతో చేపట్టారు.
ఈ పనులను సోమవారం అంజూరు శ్రీనివాసులు పరిశీలించారు. ఈ సందర్భంగా అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ… 15 ఏళ్ల కిందట వేసిన రోడ్లతో ప్రజలు పడుతున్న కష్టాలను చూసిన ఎమ్మెల్యే దాదాపు రూ.2కోట్లతో మున్సిపల్ పరిధిలో సిమెంటు రోడ్లు, కాలువల నిర్మిస్తున్నారని చెప్పారు.
ఈ ప్రాంతంలో చిన్నపాటి వర్షానికే నడుము లోతు నీటితో ప్రజలు ఇబ్బందిపడుతున్నారని… ఇకపై ఈ కొత్త రోడ్లతో, కాలువల నిర్మాణంతో ఈ కష్టాలు తొలిగిపోయాయని ఆయన అభిప్రాయ పడ్డారు.
ఈ కార్యక్రమంలో వార్డు ఇంచార్జి కొల్లూరు హరినాధ నాయుడు, జలకం కిషోర్, ఆవుల శ్రీనివాసులు, చింతామణి యానాది, శరవణ, సతీష్, బాల గౌడ్, కిరణ్, సెల్వ, పురపాలకశాఖ అధికారులు పాల్గొన్నారు.
.