నగరి నియోజకవర్గ పరిధిలో వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల్లో బహుజన సమాజ్ వాదీ పార్టీ నాయకులు కూడా పర్యటిస్తున్నారు. బాధితులతో మాట్లాడి.. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం లోని వడమాలపేట మండలం లో ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సీతారామపురం ఆదిఆంధ్రవాడ గ్రామంలో బుధవారం వీరు పర్యటించారు.
బహుజన సమాజ్ పార్టీ నగరి నియోజకవర్గ అధ్యక్షులు జీకె, నియోజకవర్గ ఇంచార్జ్ వై నాగూర్, సీతారామపురం. aaw గ్రామంలో పర్యటించారు.
గ్రామంలో ఉన్న ప్రజలతొ మాట్లాడి భారీ వర్షాలకు ఇళలోనికి నీళ్లు చేరడంతో వారి అవస్థలను పరిశీలించారు.
వీరి కష్టాలను గుర్తించి, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే సహాయం చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ తరపున కోరుతున్నామని జికె, నాగూర్ బాబు తెలిపారు.
.