చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నగరి లో కొలువై ఉన్న కరియ మాణిక్య స్వామి ఆలయంలో తిరుపతి తిరుమల దేవస్థానంలో కొవిడ్ నిబంధనలను తప్పనిసరి చేశారు.
కోవిడ్ నిబంధనలను తప్పక పాటించే భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుందని ఆలయ సూపర్డెంట్ రమేష్ కుమార్ తెలిపారు.
నూతన సంవత్సరం సందర్భంగా 2022 జనవరి 1 వ తేదీన ఉదయం ఐదు గంటలకు భక్తులకోసం దర్శనం ఏర్పాటు చేశామని జనవరి 13 మరియు 14 వ తేదీన వైకుంఠ ఏకాదశి ద్వాదశి శుభ సందర్భంగా భక్తులకు వైకుంఠం దర్శనం ఏర్పాటు చేశామని అన్నారు.
విశేష పుష్పాలతో అలంకరణలు, విద్యుత్ అలంకరణ ప్రత్యేక ప్రసాదాలు ఉంటాయని భక్తులు తప్పక కోవిడ్ నిబంధనలను పాటించాలని తెలిపారు
ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయ అధికారి వెంకటరమణ ప్రధాన అర్చకులు మారుతీ ప్రసాద్ ఆలయ సలహా కమిటీ సభ్యులు పాల్గొన్నారు
.