ఎమ్మెల్యే ఆర్కే రోజా నగరి నియోజకవర్గంలోని నగరి పుత్తూరు మున్సిపాలిటీల సమస్యలను ఈరోజు మున్సిపల్ మినిస్టర్ బొత్స సత్యనారాయణ గారికి కలిసి తెలియచేశారు.
అందులో ప్రధానంగా పుత్తూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు యొక్క ప్రస్తుత పరిస్థితిని వివరించి పున:నిర్మాణ పనులకు గాను రూపాయలు 9.00 కోట్లు అంచనా వ్యయంతో తయారుచేసిన ప్రతిపాదనలను సమర్పించి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కు వినతి సమర్పించారు.
నగరి లో ప్రతిష్టాత్మకంగా, శరవేగంగా ఎక్కడ లేనివిధంగా, పూర్తి ప్రణాళికలతో జరుగుతున్న జగనన్న అర్బన్ హౌసింగ్ కాలనీ గురించి మంత్రి గారితో చర్చించారు.
అదే విధంగా నగరి, పుత్తూరు మున్సిపాలిటీలకు సంబంధించి కాంట్రాక్టర్లకు రావలసిన బకాయిలు ను విడుదల చేయాలని ప్రతిపాదించారు.
మంత్రి గారు సానుకూలంగా స్పందించి పుత్తూరు సమ్మర్ స్టోరేజ్ పనులకు పరిపాలనా మంజూరు చేస్తారని అదేవిధంగా కాంట్రాక్టర్ల కు బిల్లులు చెల్లించే విధంగా తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
.