జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై ఎమ్మేల్యే ఆర్కే రోజా నియోజకవర్గ ప్రజలకు అవగాహన కల్పించారు.
వడమాలపెట మండలం మండల పరిషత్ కార్యాలయం నందు జరిగిన జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం లో OTS వలన జరిగే లాభాలను వివరించారు.
ఈ కార్యక్రమం లో మాట్లాడుతూ..
ఈ సంపూర్ణ గృహ గృహ పథకం ద్వారా వారి ఇంటి పై వారి పూర్తి స్వతంత్రం లభిస్తుందని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న లబ్ధిదారులు అప్పు ఎంత ఉన్నా 10000 కట్టడం తో వారికి పూర్తి ఋణ విముక్తి దొరుకుతుంది అని చెప్పారు.
ఇంతకుముందే అప్పు, వడ్డీ పూర్తిగా చెల్లించిన లబ్ధిదారులు ఎవరైనా ఉన్న వారికి పూర్తి రిజిస్ట్రేషన్ ఉచితంగా చేసి ఇవ్వబడును అని సభాముఖంగా తెలిపారు.
అదేవిధంగా అప్పు పదివేల రూపాయల కన్నా తక్కువ ఉన్న వారు ఎంత అప్పు ఉంటే అంత కడితే సరిపోతుందని చెప్పారు.
పైన తెలిపిన వాటికి దేనికి కూడా అదనపు ఛార్జీలు అయిన సర్ ఛార్జీలు, స్టాంప్ డ్యూటీ ఛార్జీలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఏవి కూడా పూర్తిగా ఉండవు అని తెలిపారు.
వడమాలపేట మండలం లో మొత్తం 2350 మంది లబ్ధిదారులు ఉండగా ఇప్పటివరకు 183 మంది మాత్రమే OTS ku అప్లయ్ చేసుకున్నారని కావున మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులైన నాయకులు అందరూ కలసి ఉద్యమంగా కార్యక్రమం చేపట్టాలని పిలుపు ఇచ్చారు.
సింహం లాంటి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి పేదవాడి బాగు కోసం కులాలు, మతాలు, పార్టీ లకు అతీతంగా చేస్తున్న బృహత్కర కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతం గా తీసుకెళ్లడంలో నియోజకవర్గం లోని నాయకులు, ప్రజా ప్రతినిధులు పూర్తిగా విజయవంతం కాలేదని, కానీ మంచిని నీరు కార్చే పనులు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ వారు మాత్రం విషప్రచారం జోరుగా చేస్తున్నారని మండల పార్టీ కేడర్ కు చురకలు అంటించారు.
అదేవిధంగా జగనన్న ప్రతిపాదించిన రైతు భరోసా, ఆసరా, చేయూత పథకాల లాంటివి నభూతో – నభవిష్యత్ లాంటిదని తెలిపారు.
అదేవిధంగా సచివాలయం ఉద్యోగులు కేవలం వారి అర్హత తో ఉద్యోగాలు సంపాదించుకున్నాం అనుకోవడం తప్పు జగనన్న మంచి మనసు తో , పరిపాలనా దృష్టి తో ఆలోచించడం వలనే ఈ వ్యవస్థ రావడంవళ్ళనే వారికి ఉద్యోగాలు లభించాయని కాబట్టి వారు విధేయత గా పని చేస్తూ పథకాలను లబ్ది దారులకు పూర్తి గా అందేవిధంగా చేయడం లో కృతజ్ఞత చూపించాలని, వాలంటీర్లు కూడా లబ్ది దారులను ఎంపిక చేయడం లో పూర్తి నిబద్దత కనబరచాలని హితవు పలికారు.
రాబోయే ఒమిక్రాన్ నుంచి అప్రమత్తం గా ఉండాలని అధికారులను ఆదేశించారు.
చివరగా ఈ నెల 21 జగనన్న పుట్టిన రోజు లోపు OTS పూర్తిగా రిజిస్ట్రేషన్ లు చేయించి ప్రతి ఒక్కరికీ ఆస్తి హక్కు కల్పించాలని కోరారు.
ఈ కార్యక్రమం లో ఎమ్మేల్యే సమక్షం లో 10 మంది OTS రిజిస్ట్రేషన్ లు చేసుకున్నారు.
.