స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల నగరి నందు ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ మరియు నాంది ఫౌండేషన్ వారి సంయుక్త సహకారంతో కళాశాల కెరీర్ గైడెన్స్ సెల్, జవహర్ నాలెడ్జ్ సెంటర్ వారు కళాశాలలో ఎంప్లాయిబిలిటి స్కిల్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని ఈనెల 13 నుండి 18 వరకు వారం రోజుల పాటు శిక్షణ ఇవ్వడం జరిగింది.
ఇందులో భాగంగా విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు లైఫ్ స్కిల్స్‌పై శిక్షణ ఇవ్వడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ వేణగోపాల్ తెలియజేశారు.
ఈ శిక్షణలో నేర్చుకున్న వివిధ అంశాలు విద్యార్థులకు భవష్యత్తులో ఉద్యోగ సాధనలో ఎంతగానో ఉపకరిస్తాయని ప్రిన్సిపల్ అన్నారు.
ఈ శిక్షణ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్ గా నాంది ఫౌండేషన్ నుండి డి.పవన్ శర్మ గారు వ్యవహరించారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ మేనేజర్ పి.లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్ మరియు ఇంటర్వ్యూ స్కిల్స్ పై శిక్షణ ఇచ్చి వేలాది మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగిందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రామంలో వైస్ ప్రిన్సిపల్ బి. సుబ్రహ్మణ్యం, కెరీర్ గైడెన్స్ సెల్ కోర్డినేటర్ డా.ఎం పంకజ గారు, జేకేసి కోర్డినేటర్ పి.నాగార్జున గారు, లాల్భాషా తదితరలు పాల్గొన్నారు.
.