శ్రీకాళహస్తిలోని నాయుడుపేట బైపాస్ రోడ్డు దగ్గరున్న ఫంక్షన్ హాల్ లో సోమవారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వివిధ రాష్ట్రాల నుంచి వొచ్చిన 222 మంది కళాకారులచే, 222 నిముషాలు, నిర్విరామంగా, నాట్య ప్రదర్శనలు జరిగాయి. సంప్రదాయ భరత నాట్యం, కూచిపూడి,ఒడిస్సీ, కథక్ మున్నగు నృత్య రీతులను, ప్రైడ్ ఇండియా కల్చరల్స్ మరియు సిటిజెన్స్ వెల్ఫేర్ ఫోరమ్ వారి సయుక్త ఆధ్వర్యంలో, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ , “నాట్యం” వైభవోత్సవ్ 2021అట్టహాసంగా నిర్వహించారు.
కళాకారుల నాట్య ప్రదర్శనలు, ఆహుతులను అలరించాయి. ఉదయం జ్యోతి ప్రజ్వలనంతో కార్యక్రమం ప్రారంభమైంది.
కళా బృందాలు, వారివారి గురువులను గౌరవిస్తూ గురు పూజోత్సవం వేదపండితుల వేద మంత్రాలతో నిర్వహించారు. కళాకారులకు మరియి వివిధ రంగాలలో విశేష సేవలందించిన వ్యక్తులకు శివ నంది, గరుడ ఎక్సెలెన్స్, Dr APJ అబ్దుల్ కలాం ఎక్సెలెన్స్, తిలై నటరాజ ,నాట్యమయూరి మరియు నాట్యచూడామణి ప్రముఖ అవార్డులతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ దర్శకులు కొండవీటి సత్యం, ప్రముఖ కూచిపూడి నృత్యాచర్లు వేదాంతం రాధే శ్యామ్, భరతనాట్యం నాట్యాచార్యులు దేవేంద్ర పిళ్ళై తాళ్లపాక సందీప్ కుమార్ చెoదూ ఆది తదితరులు ముఖ్య అతిధులుగా విచ్ఛేశారు.
ముఖ్య అతిధులు మాట్లాడుతూ, అంతరిచిపోతున్న భారత సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించుటకు, మరియు ప్రోత్సహించుటకు, కళలకు కాణాచి శ్రీకాళహస్తి పట్టణం నందు ప్రైడ్ ఇండియా కల్చరల్స మరియు సిటిజెన్స్ వెల్ఫేర్ ఫోరమ్ వారు, జాతీయ స్థాయి నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకమన్నారు.
గత పది సంవత్సరాలుగా , సిటిజెన్స్ వెల్ఫేర్ ఫోరమ్ స్వచ్చంద సంస్థ ద్వారా అనేక సామాజిక సేవలందిస్తున్న సంస్థ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణ భట్ , రాష్ట్ర కార్యదర్శి కోలా వెంకటేశ్వర రావు సంస్థ సభ్యుల సేవలను కొనియాడారు.
చివరగా సంస్థల కార్యదర్శి కోలా వెంకటేశ్వర రావు మాట్లాడుతూ ప్రార్ధించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్నట్లు పీడిత తాడిత ప్రజలకు తమ వంతు సాయం అందించడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు.
సిటిజెన్స్ వెల్ఫేర్ ఫోరమ్ చాలా కాలంగా ఉచిత టైలరింగ్, ఆర్యవర్క్స్, ఫాషన్ డిజైనింగ్ మరియు బ్యూటీషన్ కోర్సు లను అందిస్తోందని చెప్పారు. మహిళా సాధికారతే లక్ష్యంగా, ఇప్పటికి దాదాపు పది వేల మంది మహిళలకు ఉచిత ఉపాధి శిక్షణలు ఇచ్చినట్టు వెల్లడించారు. కార్యక్రమం నిర్వహించిన రమ్యశ్రీ జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు.
.