దాదాపు పాతికేళ్ల కిందట వచ్చిన ఓం చిత్రం నుంచి, మొన్నమొన్నటి సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రం వరకు ఉపేంద్ర నటించిన సినిమాలను చూసిన వాళ్లు.. అతనిని బాగా గుర్తు పెట్టుకుంటారు. ఉపేంద్ర విలక్షణమైన నటన.. అలాంటి గుర్తింపును తెచ్చి పెట్టింది. కన్నడంలో ఆయన సూపర్ స్టార్ కాబట్టే.. పొలిటికల్ పార్టీ కూడా పెట్టాడు. ఉపేంద్ర హీరోగా రూపొందిన ‘కబ్జ’ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకోసం కూడా సిద్ధమవుతోంది.
లాంకో శ్రీధర్ నిర్మాతగా, గతంలో ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని’కి దర్శకత్వం వహించి తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయిన ఆర్. చంద్రు రూపొందించిన ఈ చిత్రం, ఆ చిత్ర నిర్మాత లాంకో శ్రీధర్ సమర్పణలోనే వస్తోంది. పాన్ ఇండియా మూవీగా దీనిని.. కన్నడతో పాటు తమిళ్, తెలుగు, మలయాళం, ఒరియా మరియు మరాఠీ భాషల్లో కూడా అందిస్తున్నారు.
కబ్జ చిత్ర బృందం తాజాగా దీని మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఉపేంద్ర అభిమానుల అంచనాలకి తగ్గట్లుగానే కబ్జ మోషన్ పోస్టర్ ని సిద్ధం చేశామని దర్శకుడు ఆర్.చంద్రు తెలిపారు. కబ్జ మూవీ నుంచి ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి అనూహ్య స్పందన లభించిందని, ఉపేంద్ర నుంచి అభిమానులు ఆశించే విలక్షణత, వైవిధ్యం కబ్జ లో ఆద్యంతం ఉంటుందని నిర్మాతలు ఆర్. చంద్ర శేఖర్, మునింద్ర కె. పురా చెప్పారు.
.