ఇంతకూ ఆ రెండు పార్టీలు ఒక కూటమిలో ఉన్నట్టే అనుకోవాలా? లేదా? ఉండడమే నిజమైతే.. సాధారణంగా కూటమి పార్టీలు కలిసి అడుగులు వేస్తాయి కదా! పవన్ కల్యాణ్ నో అంటే, సోము వీర్రాజు ఎస్ అంటూ బద్వేలు ఉపఎన్నిక బరిలో దిగడానికి ఉవ్విళ్లూరుతుండడంతోనే ఈ అనుమానం కలుగుతోంది.
బద్వేలు ఎమ్మెల్యే స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికలో తాము పోటీచేయబోడం లేదని తెలుగుదేశం, జనసేన పార్టీలు ప్రకటించాయి. అయితే.. తగుదునమ్మా అంటూ.. భారతీయ జనతా పార్టీ మాత్రం తొడకొట్టి, మేం బరిలో సవాలు చేయబోతున్నాం అని తేల్చి చెప్పింది. పోటీనుంచి తప్పుకున్న చంద్రబాబు, పవన్ ఇద్దరూ ఒకటే కారణం చెప్పారు.
బద్వేలులో వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్యే హఠాన్మరణం కారణంగా జరుగుతున్న ఉప ఎన్నిక గనుక.. ఆ పార్టీ, చనిపోయిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకే మళ్లీ టికెట్ ఇచ్చింది గనుక.. అప్రకటిత సాంప్రదాయాన్ని పాటిస్తూ తాము పోటీ చేయదలచుకోలేదని వారు అన్నారు. అయితే.. జనసేనకు మిత్ర పక్షం అయిన బీజేపీ మాత్రం బరిలో దిగబోతున్నాం అని తేల్చి చెప్పింది. పైగా పవన్ కల్యాణ్ ను కూడా బద్వేలు ఎన్నికల ప్రచారానికి ఆహ్వానిస్తాం అని కూడా చెప్పింది.
ఈ రెండు పార్టీల ధోరణి ఏదో కామెడీగా కనిపిస్తోంది. మిత్రులే అయిఉండి.. ఒకరి ఆలోచనలతో మరొకరికి ఏకీభావం లేకుండా, ఎవరికి వారే అన్న తీరుగా వ్యవహరించడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. అయితే ఉప ఎన్నిక పర్వం ఎలా రసవత్తరంగా నడుస్తుందో వేచి చూడాల్సి ఉంది.
ఆదర్శిని జోస్యం : ఇది త్రిమూర్తుల వ్యూహమా..
టీడీపీ, జనసేన పోటీనుంచి తప్పుకున్నప్పుడే… ఆదర్శిని డాట్ కామ్ ఒక ప్రత్యేక కథనాన్ని అందించింది. ‘బద్వేలు విషయంలో త్రిమూర్తుల వ్యూహం ఇదే’ అనే శీర్షికతో సోమవారం ఉదయమే కథనం ప్రచురితమైంది. వీరిద్దరూ తప్పుకున్నాక బీజేపీ బరిలోకి దిగే అవకాశం ఉందని అందులో విశ్లేషించడం జరిగింది. జనసేన, తెలుగుదేశం ఇద్దరూ కూడా.. బీజేపీ అభ్యర్థికి లోపాయికారీగా మద్దతిచ్చి.. తమ మూడు పార్టీలూ కలిస్తే.. ఏమేరకు ప్రజాదరణ దక్కుతుందనే విషయాన్ని లిట్మస్ టెస్టులా పరీక్షించి చూసుకోబోతున్నారని ఆ కథనంలో విశ్లేషించారు.
సోమవారం సాయంత్రానికల్లా అదే జరిగింది. బద్వేలు బరిలో దిగబోతున్నట్లు సోము వీర్రాజు తేల్చి చెప్పారు. ఈ ఉప ఎన్నికను వదిలిపెట్టేది లేదని అన్నారు. పవన్ ను ఎన్నికల ప్రచారానికి కూడా ఆహ్వానిస్తాం అని చెప్పడాన్ని బట్టి.. ముందే ఈ మేరకు రహస్య ఒప్పందం కుదిరినట్టుగానే పలువురు అనుమానిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
మిత్రులకు ‘శుభోదయం’ సందేశాలు పంపడానికి సుభాషితాలు ఎంచుకోండి..
సురేష్ పిళ్లె : ఒక కలం చావు.. వేయి కలల చావు.. జర్నలిజంలో పెడపోకడలు..
వేదనలో సమంత.. లొకేషన్ లోనే కన్నీళ్లు పెట్టుకున్న వైనం
movie review : కంటతడి పెట్టించే సినిమా ‘రిపబ్లిక్’
కేబినెట్ ప్రక్షాళన ఒక సమరం : జగన్ vs ముగ్గురు బలమైన మంత్రులు
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్‌పిసి 41 (ఎ)
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
చంద్రబాబు, పవన్, మోడీ దళం కలిసి పనిచేసి 2014 లో అధికారం దక్కించుకున్నారు. 2019లో విడివిడిగా బరిలోకి దిగి చతికిలపడ్డారు. ఇప్పుడు మళ్లీ కలిస్తే ప్రజలు ఆదరిస్తారా? ఛీ కొడతారా? అనే భయం వారిలోనే ఉంది. అందుకే.. బద్వేలు ఎన్నికలో బీజేపీ అభ్యర్థికి రహస్యంగా మద్దతిచ్చి.. తమ మూడు పార్టీలకు కలిపి రాగల ఓట్లు ఎన్నో బేరీజు వేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. లభించే ఫలితాన్ని బట్టి.. వారు.. వచ్చే ఎన్నికలలో పొత్తులకు సంబంధించిన మంత్రాంగాన్ని రచిస్తారని అర్థం చేసుకోవచ్చు.
తాను సానుభూతితో ఎన్నికలనుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన తర్వాత.. మిత్రపక్షంగా ఉండి బీజేపీ మాత్రం బరిలోకి దిగుతాననడం వెనుక డ్రామా ఏమిటో.. పవన్ కల్యాణే ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది.
Discussion about this post