దేశంలోని అతిపెద్ద రిటైలర్ రిలయన్స్ రిటైల్ యువత కోసం ప్రత్యేకించిన ఫ్యాషన్ రిటైల్ ఫార్మాట్ యూస్టాను హైదరాబాద్‌లోని శరత్ సిటీ మాల్‌లో ప్రారంభించింది.
సమకాలీన సాంకేతిక ఆధారిత స్టోర్ లేఅవుట్లతో, యువ వినియోగదారుల కోసమే ప్రత్యేకంగా సరసమైన ధరలలో హై-ఫ్యాషన్‌ను యూస్టా అందిస్తుంది. ఉదాహరణకు అన్ని ఉత్పత్తుల ధరలు రూ.999 లోపు ఉండగా, ఎక్కువ ఉత్పత్తుల ధర రూ.499 లోపే ఉంటుంది.
యూనిసెక్స్ మర్కండైజ్, క్యారెక్టర్ మర్కండైజ్, వీక్లీ రిఫ్రెష్ క్యాప్సూల్‌తో పాటు, యూస్టా ప్రతి వారం తన “స్టార్టింగ్ నౌ” కలెక్షన్లో సరికొత్త లుక్స్ విడుదల చేస్తుంది, ఇక్కడ తాజా ఫ్యాషన్‌ను మ్యాచింగ్ యాక్సెసరీలతో కలిపి పూర్తిస్థాయి శ్రేణిని అందిస్తుంది.
యూస్టా ప్రారంభం సందర్భంగా రిలయన్స్ రిటైల్ ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ ప్రెసిడెంట్ మరియు సిఇఒ అఖిలేష్ ప్రసాద్ మాట్లాడుతూ, “యూస్టా ఒక యువ, డైనమిక్ బ్రాండ్. ఇది ఈ దేశంలోని యువతతో పెరుగుతుంది, వారితోపాటే అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందుతున్న ఫ్యాషన్ అవసరాలను అర్థం చేసుకోవడానికి ఈ బృందం భారతదేశ యువతరంతో నిరంతరం పనిచేస్తుంది. రోజూ తాజాదనం పరంగా, ఔచిత్యం పరంగా ‘డే వన్’గా ఉంటుంది. యూస్టా యువతకు వాయిస్ ఇవ్వడమే కాకుండా, తమను తాము వ్యక్తీకరించుకునే స్వేచ్ఛను కూడా ఇస్తుంది, ఎందుకంటే వారే మాకు సంపూర్ణ తారలు” అని చెప్పారు.
యూస్టా స్టోర్లలో సమాచారాన్ని పంచుకోవడానికి వీలుగా క్యూఆర్ ఎనేబుల్డ్ స్క్రీన్లు, సెల్ఫ్ చెకౌట్ కౌంటర్లు, ఛార్జింగ్ స్టేషన్లతో సహా అనేక టెక్ టచ్ పాయింట్లు ఉంటాయి.
వినియోగదారుల కోసం యూస్టా ఒక స్వచ్ఛంద సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఆ సంస్థ ద్వారా.. వినియోగదారులు దుకాణాలలో తమ పాత దుస్తులను అవసరంలో ఉన్నవారికి దానం చేయడానికి, వాటిని కమ్యూనిటీ కార్యక్రమాలకు ఉపయోగించడానికి వీలు కల్పిస్తుంది. సుస్థిరత, స్థానిక కమ్యూనిటీల పట్ల బ్రాండ్ నిబద్ధత స్థానికంగా సేకరించిన, రూపొందించిన ఉత్పత్తులను తన స్టోర్లలో ప్రతిబింబిస్తుంది. దీనివల్ల యూస్టా ప్రత్యేకత నిలబడటమే కాకుండా.. స్థానికంగా ఆర్థిక వ్యవస్థలు కూడా పెరిగేందుకు దోహదపడుతుంది. అదే సమయంలో దూరాల నుంచి తీసుకురాకపోవడంతో కార్బన్ ఫుట్‌ప్రింట్‌ను వీలైనంత తగ్గించడానికి కూడా ఇది సహాయపడుతుంది.
యూస్టా రేంజ్ అంతా ఇప్పుడు హైదరాబాద్‌లో ఈ బ్రాండ్ యొక్క మొట్టమొదటి స్టోర్‌లో అందుబాటులో ఉంటుంది. అంతేకాక ఆన్‌లైన్‌లోనూ ఎజియో, జియోమార్ట్ ద్వారా కూడా వీటిని పొందవచ్చు.
Discussion about this post