నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా కుమారుడు కౌశిక్.. తొలిరోజే కొవిడ్ వేక్సిన్ వేయించుకున్నారు. 15 -18 ఏళ్ల మధ్య వయస్సున్న పిల్లలకు కొవిడ్ వేక్సిన్ లు వేయడానికి ప్రభుత్వం అనుమతించిన తొలిరోజే.. జనవరి 3వ తేదీనే కౌశిక్ వేక్సిన్ వేయించుకున్నారు.
సాధారణంగా కొవిడ్ గురించే ప్రజలెవ్వరికీ స్పష్టత లేకుండా రకరకాల భయాలు వ్యాప్తిలో ఉన్న నేపథ్యంలో కొవిడ్ వేక్సినేషన్ గురించి కూడా అంతే భయాలు అందరిలోనూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. సెలబ్రిటీలు, సమాజంలో పెద్ద హోదాల్లో ఉన్నవారు.. ముందుకొచ్చి వేక్సిన్ వేయించుకోవడం అనేది.. తతిమ్మా సామాన్య ప్రజలందరికీ కూడా ఒక నమ్మకాన్ని ఇస్తుంది. భయాన్ని పోగొడుతుంది. ప్రధాని, ముఖ్యమంత్రి లాంటి వారందరూ కూడా.. తమ వయస్సుకు వేక్సిన్ వేయడం అనుమతి వచ్చిన వెంటనే వేయించుకుంటున్నది అందుకే.
ఈ సమయంలో.. పిల్లలకు ప్రభుత్వం వేక్సిన్ అనుమతించిన తర్వాత.. కూడా కొన్ని దుష్ప్రాచారాలు సాగాయి. ఈ వేక్సిన్ తో పిల్లలకు రకరకాల ఇతర ఇబ్బందులు వస్తాయంటూ కొందరు అబద్ధాలను ప్రచారం చేశారు. ఇలాంటి సమయంలో ప్రజలందరూ తమ పిల్లలను ముందుకు తీసుకువచ్చి వేక్సిన్ లు వేయించాలంటే.. ప్రముఖులు అందరికంటె ముందు వేయించుకోవడం మంచి పరిణామం.
ఈ విషయంలో రోజా ఆదర్శంగా నిలిచారు. రోజాకు ఇద్దరు పిల్లలున్నారు. పాప, బాబు! పాప చెన్నైలో చదువుతుంటుంది. బాబు కౌశిక్ నగరిలోనే ఉండడంతో తాను అక్కడ లేకపోయినప్పటికీ.. రోజా వైద్య ఆరోగ్య సిబ్బంది మాట్లాడి తన కొడుక్కు తొలిరోజే వేక్సిన్ వేయించారు. ఆ రకంగా కౌశిక్ ను కూడా రోల్ మోడల్ గా నిలిపారని పలువురు అభినందిస్తున్నారు.
.