భారీ వర్షాలు వరదల నేపథ్యంలో నష్టపోయిన వరద బాధితులను ఆదుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గుర్తు చేశారు.
ఆదివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఏడి రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో సబ్సిడీ ధరలపై వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమం జరిగింది.
కార్యక్రమంలో జెడ్ పి టి సి విజయలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి ,గ్రామసర్పంచ్ మంజుల రమేష్ , మండల వ్యవసాయ సలహా సంఘం చైర్మన్ శ్యాంప్రసాద్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం వేగంగా సాధించింది అన్నారు.
వర్షాల కారణంగా ఇండ్లలోకి నీరు చేరిన , నేలమట్టమైన ఇల్లు ,పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్ల వివరాలను సంబంధిత స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో అధికార బృందాలు సర్వే చేసి పంపడం వల్ల ఆర్థిక చేయూత అందించడం జరిగిందన్నారు.
ఇందులో భాగంగానే పూర్తిగా ఇళ్లు కోల్పోయిన వారికి 91 వేలు ,పాక్షికంగా ఇల్లు దెబ్బతిన్న వారికి 3200 చొప్పున నష్టపరిహారం పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు .రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగో లేకపోయినా వరద విపత్తులో బాధితులు అందరిని ఆదుకున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే అని ఆయన స్పష్టం చేశారు .అయితే భారీ వర్షాలు పడడం వల్ల నియోజవర్గంలో పలు రోడ్లు ,వంతెనలు ధ్వంసమై అపార నష్టం వాటిల్లిందని ఆయన చెప్పారు.
దీనిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు వరద నష్టం పై వినతి అందించడం జరిగింది అన్నారు . గతంలో ఎప్పుడూ కూడా బాధితులకు నష్టపరిహారం అందించిన దాఖలాలు లేవని గుర్తు చేశారు .అయితే అభివృద్ధి అడ్డుకోవడానికి ప్రతిపక్ష టీడీపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎత్తులు జిత్తులు ,కుట్రలు కుతంత్రాలు ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలని ఆయన స్థానిక ప్రజా ప్రతినిధులను కోరారు.
సంపూర్ణ భూ హక్కులు కల్పించాలని ఉద్దేశంతో వన్టైమ్ సెటిల్మెంట్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తే దీనిపై కూడా చంద్రబాబు నాయుడు రాద్ధాంతం చేయడం తగదన్నారు .ప్రతి చిన్న విషయానికి కోర్టు మెట్లెక్కి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడం సమంజసం కాదు అన్నారు.
ఓ టీ ఎస్ లక్ష్యాలను సాధించడానికి స్థానిక ప్రజా ప్రతినిధులు సమిష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు . సబ్సిడీ ధరపై వేరుశనగ విత్తనాల బస్తాలు స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం రైతులకు పంపిణీ చేశారు.
ఒక కేజీ వేరుశెనగ విత్తనాలు 89 రూపాయలు కాగా ఇందులో సబ్సిడీ పోను బస్తా(30) కేజీలు ధర 1602 రూపాయలు రైతులు చెల్లించాల్సి ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఐ వీరాంజనేయులు , వ్యవసాయ శాఖ ఏవో గౌరీ , సచివాలయం వ్యవసాయ అసిస్టెంట్లు రుద్రయ్య , మునిమోహన్ , పరిషత్ కోఆప్షన్ సభ్యులు మస్తానమ్మ ,ఎంపిటిసిలు సరవన ,మురళి ,స్వర్ణ , సర్పంచులు రవి రెడ్డి , శిరీష శ్రీనివాస్ రెడ్డి , పార్వతీ సన్ఆసయ్య , రూబెన్ ,గోవిందస్వామి ,శ్రీరాములు రెడ్డి , వైయస్ఆర్ సీపీ నేత ఢిల్లీబాబు రైతులు తదితరులు పాల్గొన్నారు .
.