సూళ్లూరుపేట తులసి ఆయుర్వేదిక్ ఆసుపత్రి వారి నూతన శాఖను శనివారం శ్రీసిటీలో ప్రారంభించారు.
స్థానిక మెడికల్ సెంటర్ లో దీనిని ఏర్పాటు చేయగా, ప్రారంభోత్సవ కార్యక్రమంలో శ్రీసిటీ వైస్ ప్రెసిడెంట్ (కస్టమర్ రిలేషన్స్) సి.రమేష్ కుమార్, షార్ మాజీ డిప్యూటీ డైరెక్టర్ ఆదిశేషారెడ్డి ముఖ్య అతిదులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తులసి ఆయుర్వేద ఆసుపత్రి ఇంచార్జి డాక్టర్ శివప్రసాద్ మాట్లాడుతూ, దీర్ఘకాలిక వ్యాధులు, మానసిక ఒత్తిడి, కీళ్ల నొప్పులు, చర్మ వ్యాధులు, సంతానలేమి, బీపీ, షుగర్ ఇంకా పలు రకాల వ్యాధులకు కొట్టక్కల్ ఆయుర్వేద మందులు, కేరళ పంచకర్మ చికిత్స ద్వారా ఇక్కడ వైద్యం అందించనున్నట్లు తెలిపారు.
శ్రీసిటీ వైద్య సదుపాయాలలో భాగంగా మరో ఆసుపత్రి రావడం పట్ల శ్రీసిటీ ఎండీ తన ప్రకటనలో ఆనందం వ్యక్తం చేశారు.
తులసి ఆయుర్వేద ఆసుపత్రి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీసిటీ పరిశ్రమవర్గాలు, పరిసర ప్రాంతాల ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
.